/rtv/media/media_files/2024/12/24/2Amvl7SgOkvu41tAUES1.jpg)
daku maharaj chinni chinni song
సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, బాలకృష్ణ డాకూ మహారాజ్ సినిమాలు విడుదల అవుతున్నాయి. మూడూ పెద్ద హీరోల సినిమాలు కావడంతో పోటీ చాలా ఎక్కువగా ఉంది. ఈ మూవీస్ జనవరి 10 నుంచి 15 లోపునే విడుదల అవుతున్నాయి. ఇందులో బాలకృష్ణ నటించిన డాకూ మహారాజ్ జనవరి 12న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకసారి విడుదల అవుతోంది.
Also Read: ప్రతి సోమవారం హైడ్రా ప్రజావాణి.. ఈ నంబర్లకు కాల్ చేయండి!
టికెట్లను రేట్లు పెంపు..
డాకూ మహారాజ్ టికెట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తాజాగా అనుమతులను ఇచ్చింది. ఈ మూవీ టికెట్ల రేట్లను పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. జనవరి 12 ఉదయం 4 గంటలకు వేసే బెనిఫిట్ షో టికెట్ రేటును రూ.500గా నిర్ణయించింది. దాంతో పాటూ ఫస్ట్ డే నుంచి జనవరి 25 వరకు రోజుకు 5 షోలకు అనుమతి ఇచ్చింది. దీంట్లో మల్టీప్లెక్స్ టికెట్‌పై రూ.135, సింగిల్ స్క్రీన్‌లపై రూ.110 వరకు పెంచుకోవచ్చని చెప్పింది.మరోవైపు తెలంగాణలో మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రీసెంట్‌గా పుష్ప–2 సినిమా వివాదం తర్వాత బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు లాంటివి ఉండవని ముయమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పడంతో ఇక్కడ యథావిధిగా ఎప్పుడూ ఉన్న విధంగానే సినిమాలు ఆడనున్నాయి.
సంక్రాంతికి వస్తున్న నందమూరి బాలకృష్ణ "డాకు మహారాజ్" సినిమాకి టికెట్స్ రేట్లు పెంచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..@ncbn @PawanKalyan #Balakrishna @naralokesh @vamsi84 @SitharaEnts#DakuMaharaaj pic.twitter.com/nOSt4PVlHd
— YJR (@yjrambabu) January 4, 2025
Also Read: HYD: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు