/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/heat-3-jpg.webp)
Weather
ఆంధ్రప్రదేశ్‌లో భానుడి రోజురోజుకి తన తీవ్ర ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండలతో పాటుగా వేడిగాలులకు జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత విపరీతంగా కనిపిస్తోంది. బుధవారం కృష్ణా జిల్లా ఉంగుటూరు, ఉయ్యూరు.. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి, జియమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పాలకొండ, సీతంపేట, వీరఘట్టం.. శ్రీకాకుళం జిల్లా బూర్జ, లక్ష్మీనరసుపేట, హీరామండలం.. విజయనగరం జిల్లా బొబ్బివి, వంగర మండలాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ తెలిపారు.
Also Read: Trudeau:కుర్చీ చేత పట్టుకుని..నాలుక బయటపెట్టి..ట్రూడో ఫొటో వైరల్!
వడగాల్పులు వీచే మండలాల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో-18మండలాలు, విజయనగరం జిల్లాలో 21 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 3 మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా-12, అనకాపల్లి జిల్లా-13, కాకినాడ జిల్లా-18, కోనసీమ జిల్లా-11, తూర్పుగోదావరి జిల్లా-19, పశ్చిమ గోదావరి జిల్లా-4, ఏలూరు జిల్లా-16, కృష్ణా జిల్లా-10, గుంటూరు జిల్లా-14, బాపట్ల జిల్లా-3, పల్నాడు జిల్లాలోని 12 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య నుంచే వాతావరణ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వేసవి కాలం ప్రారంభం కాక ముందే ఎండలు మండుతున్నాయి. తీవ్ర వేడిగాలులతో ప్రజలు ఎండలో బయటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు . వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో మొబైల్స్‌కు హెచ్చరికలు పంపించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వారు చెబుతున్నారు.
ఎండ తీవ్రత వల్ల ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. వాస్తవానికి గతేడాది ఏప్రిల్ నుంచి వడగాలుల ప్రభావం ప్రారంభంకాగా.. ఈసారి ఫిబ్రవరి నుంచి పరిస్థితి దారుణంగా ఉంంది. కోస్తా జిల్లాల్లో ఎండలకు తేమ వాతావరణం తోడు కావడంతో ఉక్కపోత ఎక్కువగా ఉంటోంది. ఎండల తీవ్రతను గమనించి చిన్న పిల్లలు, పెద్దవాళ్లు బయటకు రాకపోవడం మంచిదంటున్నారు.. ఈ మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు.
Also Read:Ukraine: కాల్పుల విరమణకు అంగీకరించిన ఉక్రెయిన్!
Also Read: Posani: పోసాని కృష్ణమురళికి బిగ్ రిలీఫ్.. ఈరోజు విడుదల!