/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/heat-3-jpg.webp)
Weather
ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో-13, విజయనగరం జిల్లాలో-18, పార్వతీపురం మన్యం జిల్లా-14, అల్లూరి సీతారామరాజు-3, కాకినాడ జిల్లా-2, తూర్పుగోదావరి జిల్లా-7, ఏలూరు జిల్లా-1 మండలాల్లో(58) వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
Also Read: Election Commission: ఓటర్ ఐడీతో ఆధార్ కార్డు లింక్.. కీలక ప్రకటన చేసిన ఎలక్షన్ కమిషన్!
అలాగే గురువారం 37 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని అధికారులు ప్రకటించారు. బుధవారం వడగాల్పులు వీచే మండలాలు (58). మంగళవారం నంద్యాల జిల్లా పెద్ద దేవళాపురంలో 42.7°C, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 42.6°C, కడప జిల్లా ఖాజీపేటలో 41.8°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని సూచించారు.
Also Read: Ap Crime: జెయింట్ వీల్ తొట్టి ఊడిపడి యువ సాఫ్ట్‌వేర్ మృతి..!
AP Weather Report
రాష్ట్రంలో ఎండలు కొనసాగుతుండగా.. వడగాలుల తీవ్రత కొంతమేర తగ్గింది. దీంతో జనాలకు కాస్త ఉపశమనం దక్కింది. సోమవారం మొత్తం 118 మండలాల్లో వేడి గాలులు వీస్తుండగా.. మంగళవారం 49 మండలాల్లో వీచినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో భానుడి దెబ్బకు రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.. దీంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. చాలా చోట్ల ఎండ నుంచి ఉపశమనం పొందడానికి గొడుగులు, టోపీలతో బయటికెళ్లాల్సిన పరిస్థితులు కనపడతున్నాయి. వేడి నుంచి తప్పించుకునేందుకు కూల్ డ్రింక్స్, పండ్లరసాలు ఎక్కువగా తాగుతున్నారు. మరో రెండు నెలలు రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఏపీలోని మన్యంలోనూ ఎండల తీవ్రత కనిపిస్తుంది.. మార్చి రెండో వారం నుంచే జనం ఎండ నుంచి రక్షణ పొందేందుకు గొడుగులు వాడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఏజెన్సీలోనూ ఎండలు కాస్తుండడంతో గిరిజనులు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల తర్వాత బయటకు రావాలంటేనే ప్రజలు బెదిరిపోతున్నారు. మార్చిలోనే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో.. ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన మొదలైంది.
ఎండలో తిరగడంతో శరీరంలో వేడిని నియంత్రించే వ్యవస్థ దెబ్బతింటుంది. 'వడదెబ్బ తగిలిన వ్యక్తికి తలనొప్పి, తలతిరగడం, నోరు ఎండిపోవడం, తీవ్రమైన జ్వరం రావడం, దప్పిక వేయడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఒళ్లంతా పొడిబారిపోవడం, వాంతులు, స్పృహ తప్పిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి' అంటున్నారు డాక్టర్లు.
సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లకపోవడం మంచిది. ఈ ఎండాకాలం జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
Also Read: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!
Also Read: TG Budget 2025: నేడే తెలంగాణ బడ్జెట్.. ఆ పథకాలకు భారీగా నిధులు?