/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/schools-jpg.webp)
Half day schools
వేసవి కాలం (Summer Season) రావడంతో స్కూల్ విద్యార్థులకు ఒంటిపూట బడుల (Hoff Day Schools) విషయంలో ఏపీ ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతు నమోదవుతున్నాయి. ఇంకా మార్చి నెలలో అయితే ఎండ తీవ్రత పెరుగుతుంది. ఉదయం 11 గంటలు దాటిన తర్వాత బయటకు అడుగు కూడా పెట్టలేని పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ వారికి ఇప్పటికే పరీక్షలు మొదలయ్యాయి. మార్చి 17వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి.
ఇది కూడా చూడండి: TTD Jobs: టీటీడీలో ఉద్యోగాలు.. నిరుద్యోగ యువతకు చైర్మెన్ అదిరిపోయే శుభవార్త!
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ప్రస్తుతం రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండ తీవ్రతకు తట్టుకోలేక చాలా మంది బయటకు వెళ్లలేకపోతున్నారు. పెద్దవారే ఈ తీవ్రమైన ఎండకి ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది స్కూల్ పిల్లలు ఇబ్బంది పడతారని ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. తీవ్రమైన ఎండ బారిన పడితే నీరసం, అలసట వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఇలా కాకుండా ఉండాలంటే మజ్జిగ, లస్సీ, ఓఆర్‌ఎస్ వంటివి తాగుతుండాలి. అప్పుడు మీ బాడీ డీ హైడ్రేషన్‌కు గురి కాదు.
ఇది కూడా చూడండి: హైదరాబాద్‌కు AICC ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.. ముందున్న సవాళ్లు ఇవే..!
ఇదిలా ఉండగా ఈసారి ఏపీ బడ్జెట్‌లో ప్రభుత్వ సూళ్లకు (Government Schools) నిధులు మంజూరు చేశారు. రాష్ట్ర ప్రగతికి పరుగులు పెట్టించేలా వివిధ విధాన నిర్ణయాలు ఉన్నాయని బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.
విద్యా, మున్సిపాల్టీలు, తెలుగు భాషాభివృద్ధి వంటి అంశాలపై కీలక విధాన నిర్ణయాలు చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్ అందించడంతో స్థానిక సంస్థలకు విద్యుత్ ఛార్జీల భారం తగ్గనుందనే చెప్పాలి.
ఇది కూడా చూడండి: Uttarakhand: ఉత్తరాఖండ్‌లో దారుణం.. హిమపాతంలో చిక్కుకున్న 57 మంది కార్మికులు