AP: ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులను తొలగించిన సర్కార్

లోకాయుక్త ఇచ్చిన ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎలాంటి పర్మిషన్ లేకుండా, విధులకు గైర్హాజరవుతున్న55 మంది ఉద్యోగులను వెంటనే ఉద్యోగాలు తొలగించాలని ఏపీ సర్కార్‌ కి లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది.

New Update
AP : నేడు ఏపీ కొత్త టెట్‌ నోటిఫికేషన్‌.. దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే!

లోకాయుక్త ఇచ్చిన ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 55 మంది ప్రభుత్వ వైద్యులను విధుల నుంచి టెర్మినేట్ చేసింది. విధులకు గైర్హాజరు అవుతున్న ప్రభుత్వ వైద్యులను.. ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలోనే చర్యలు ప్రారంభించి.. ఆ 55 మంది ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలిగించినట్లు ఏపీ ప్రభుత్వం తిరిగి లోకాయుక్తకు నివేదికను సమర్పించింది. 

Also Read: Zelensky-Starmer: ఉక్రెయిన్‌ కి మద్దతుగా బ్రిటన్ ప్రధాని!

లోకాయుక్త ఆదేశాలు, ప్రభుత్వం నిర్ణయంతో.. ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన 55 మంది ఉద్యోగులు.. తమ ఉద్యోగాలను కోల్పోయారు. అయితే ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా.. ఇష్టం వచ్చినట్లు విధులకు హాజరుకాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాలు పోయిన వారిలో అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లాంటి వారంతా ఉన్నారు.కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.

Also Read: Delhi: ఆర్థిక, రెవెన్యూ ఆమె దగ్గరే...ఢిల్లీ మంత్రుల శాఖల కేటాయింపులు ఇవే..

ఏడాదికి పైగా విధులు...

ప్రభుత్వ వైద్యుల వ్యవహారశైలిపై శ్రీనివాస్ గౌడ్.. లోకాయుక్త అధికారులకు ఫిర్యాదు చేశారు. కొందరు గవర్నమెంట్ డాక్టర్లు ఎలాంటి అనుమతి తీసుకోకుండా.. సెలవులు పెట్టకుండా ఏడాదికి పైగా విధులు నిర్వర్తించడం లేదని.. శ్రీనివాస్ గౌడ్ లోకాయుక్తకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కారణంగా గవర్నమెంట్ డాక్టర్లు లేక.. అనారోగ్యంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తన ఆవేదనను లోకాయుక్త ముందు ఉంచారు.

శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదును స్వీకరించిన లోకాయుక్త.. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా పరిగణించింది. దీనిపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. అదే సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా.. సెలవులు కూడా పెట్టకుండా.. ఎక్కువ కాలం విధులకు హాజరుకాని ఆ ప్రభుత్వ వైద్యులను వెంటనే గుర్తించి.. వారిని విధుల నుంచి తొలగించాలని లోకాయుక్త స్పష్టం చేసింది. 

దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం.. లోకాయుక్త ఇచ్చిన ఆదేశాలతో సదరు 55 మంది వైద్యులను గుర్తించి.. వారి ఉద్యోగులను పీకేసింది.  లోకాయుక్త ఆదేశాల మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. ఉద్యోగాలు కోల్పోయిన ప్రభుత్వ వైద్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Also Read:ఛాంపియన్ ట్రోఫిలో భారత్‌ శుభారంభం.. మొదటి మ్యాచ్‌లోనే విక్టరీ

Also Read: TG News: జగన్‌తో విందు కోసం తెలంగాణకు అన్యాయం చేశారు.. మంత్రి సంచలన కామెంట్స్!

Advertisment
Advertisment
Advertisment