AP Crime : ఏపీలో దొంగల బీభత్సం ..షాపుల షట్టర్లు పగుల గొట్టి...

 శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో అర్ధరాత్రి వరుస దొంగతనాలతో దొంగలు హల్చల్ చేశారు. కొత్తచెరువు, ఓబుల దేవర చెరువు మండల కేంద్రాల్లోని దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. రెండు దుకాణాలతో పాటు కిరాణాషాప్ లో నగదుతో పాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు.

New Update
Thieves In Satyasai District...

Thieves In Satyasai District...

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి (Puttaparthi) నియోజకవర్గంలో బుధవారం అర్ధరాత్రి వరుస దొంగతనాలతో దొంగలు (Thievs) హల్చల్ చేశారు. కొత్తచెరువు , ఓబుల దేవర చెరువు మండల కేంద్రాల్లో నాలుగు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. కొత్తచెరువు ప్రధాన రహదారిపై ఉన్న దర్గా షాపింగ్ కాంప్లెక్స్ లో రెండు దుకాణాలతో పాటు బాబు కిరాణా షాప్ లో రూ. 20 వేల నగదు, రూ.30 వేలు విలువచేసే సిగరెట్లు ఎత్తుకెళ్లారు. సాయినాథ్ షాప్ లో సిగరెట్ బండీల్‌ తో పాటు రూ. లక్షా యాభైవేల నగదు చోరీ జరిగినట్లు బాధితులు తెలిపారు. 

Also Read : Actor Rana Daggubati : దగ్గుబాటి కుటుంబంలో విషాదం

Thieves In Satyasai District

కొత్త చెరువులో ఉన్న దుకాణానికి సంబంధించి షట్టర్ ఓపెన్ చేశారని ఉదయం తెలియగానే పరుగెత్తుకు వచ్చానని బాధితుడు చాంద్ బాషా తెలిపారు. ఇక్కడకు రాగానే మరో దుకాణానికి సంబంధించి షట్టర్ కూడా తెరిచి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న సీఐ ఇందిరా ఘటనా  స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం ఆధారాలను సేకరించారు. 

Also Read :Also Read: China: ఆ కంపెనీ ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్‌...ఎంత డబ్బు లెక్కపెడితే అంతా మీకే..కానీ కేవలం..!

అదేవిధంగా ఓబుల దేవర చెరువులో అర్ధరాత్రి సమయంలో రెండు దుకాణాలకు సంబంధించి షట్టర్ల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఒక దుకాణంలో రూ.30 వేల నగదు ఎత్తుకెళ్లిపోయారు. మరో దుకాణంలో చోరీ చేస్తుండగా శబ్ధం కావడంతో దుకాణం పైనే నివాసం ఉంటున్న యజమాని గట్టిగా కేకలు వేయడంతో దొంగలు పరారయ్యారు. కాగా శ్రీసత్యసాయి జిల్లాలో ఇటీవల కాలంలో వరుస దొంగతనాలు జరుగుతుండడం తో జనం భయపడిపోతున్నారు.

Also Read :Also Read: Maha Kumbh mela: వీవీఐపీల పాస్‌ లు రద్దు..వాహనాలకు కూడా నో ఎంట్రీ..కుంభమేళాలో మార్పులు!

ఒకేరోజు నియోజకవర్గంలోనాలుగు షాపుల్లో దొంగతనం చేయడంపై ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాగా ప్రధాన రహదారిపైనే ఉన్న దుఖాణాల్లో అర్ధరాత్రి వరుస దొంగతనాలు చేసి పోలీసులకు దొంగలు సవాల్ విసురుతున్నారు. కాగా వరుస దొంగతనాలు జరగడంపై పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. కేసులు నమోదు చేసి దొంగల కోసం వేట ప్రారంభించారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Also Read :  ఏపీలో ఇక నుంచి అర్థరాత్రి 12 వరకు హోటల్స్‌...మంత్రి కీలక ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Betting: ‘ప్లీజ్‌ డోంట్‌ ప్లే ఆన్‌లైన్‌ గేమ్స్‌’.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి!

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ మోసానికి మరో యువకుడు బలయ్యాడు. ఏపీ హిందూపురంలో 6 లక్షల అప్పు చేసిన జయచంద్ర రైలు కిందపడి చనిపోయాడు. ఆత్మహత్యకు ముందు  ‘ప్లీజ్‌ డోంట్‌ ప్లే ఆన్‌లైన్‌ గేమ్స్‌’ అంటూ ఓ చీటీ రాసి తన జేబులో పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

New Update
betting

Online Betting Scam Anantapur boy Jayachandra sucide

Betting: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ మోసానికి మరో యువకుడు బలయ్యాడు. ఏపీ హిందూపురంలో 6 లక్షల అప్పు చేసిన జయచంద్ర రైలు కిందపడి చనిపోయాడు. చనిపోయే ముందు  ‘ప్లీజ్‌ డోంట్‌ ప్లే ఆన్‌లైన్‌ గేమ్స్‌’ అంటూ ఓ చీటీ రాసి తన జేబులో పెట్టుకున్నాట్లు పోలీసులు తెలిపారు.

 

రూ.6 లక్షలు అప్పు చేసి బెట్టింగ్..

ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పరిగి మండలం పైడేటి గ్రామానికి చెందిన ఆదినారాయణ, వెంకటలక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు ఇంటిదగ్గరే వ్యవసాయం చేస్తుండగా చిన్నకొడుకు జయచంద్ర(23) డిగ్రీ వరకు చదువుకున్నాడు. పాలసేకరణ కేంద్రం నడిపిస్తూ ఈ కుటుంబం జీవనం సాగిస్తోంది. అయితే కొంతకాలంగా 
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్స్‌కు అలవాటుపడ్డ జయచంద్ర.. రూ.6 లక్షలు అప్పు చేసి బెట్టింగ్ కాసి నష్టపోయాడు. దీంతో అప్పులు తీర్చేందకు బెంగళూరు వెళ్లి జాబ్ చూసుకున్నాడు. 

Also Read: Telangana: తెలంగాణలో ద్రోణి ప్రభావం... మరో 2 రోజులు వానలు.. పిడుగులు!

అయితే అక్కడపని సరిగా లేకపోవడంతో తిరికి ఇంటికి వచ్చాడు. ఆదివారం తెల్లవారుజామున హిందూపురం సమీపంలోని రైలు కిందపడి చనిపోయాడు. ఆత్మహత్యకు ముందు ‘ప్లీజ్‌ డోంట్‌ ప్లే ఆన్‌లైన్‌ గేమ్స్‌’ అంటూ ఓ చీటీ రాసి జేబులో పెట్టుకున్నాడు.తన షర్డుపై కూడా అలాగే రాసుకున్నాడు. అప్పు కడతామని చెప్పినప్పటికీ కొడుకు చనిపోవడంతో పేరెంట్స్, బంధువులు గుండెలు పగిలేలా రోధించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై సజ్జప్ప తెలిపారు. 

Also Read: Zelensky: చెప్పుకోవడానికే కాల్పుల విరమణ..దాడులు మాత్రం ఆగడం లేదు!


sucide | young-boys | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment