Anakapalli: బన్నీని ఎన్‌కౌంటర్ చేయండి.. బాధితుల సంచలన డిమాండ్!

విశాఖ అనకాపల్లిలో జరిగిన హిజ్రా హత్యకేసుపై ట్రాన్స్‌జెండర్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తాము ఆడా కాదు మగ కాదు.. అర్ధనారీశ్వరులమని, ప్రభుత్వం తమకు ప్రత్యేక చట్టం కల్పించాలని కోరుతున్నారు. దీపునీ చంపిన బన్నీని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

New Update
hijera case

Anakapalle Transgenders murder case hijra protest

విశాఖ అనకాపల్లిలో జరిగిన హిజ్రా హత్యకేసుపై ట్రాన్స్‌జెండర్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తాము ఆడా కాదు మగ కాదు.. అర్ధనారీశ్వరులమని, ప్రభుత్వం తమకు ప్రత్యేక చట్టం కల్పించాలి కోరుతున్నారు. దీపునీ చంపిన బన్నీని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఎన్ కౌంటర్ చేయండి..

ఈ మేరకు ట్రాన్స్ జెండర్ దిలీప్ (ఊరఫ్ దీపు) హత్య కేసులో రాష్ట్రం నలుమూలనుంచి ట్రాన్స్ జెండర్లు అనకాపల్లి తరలి వచ్చారు. దిలీప్ హత్య కేసు నిందితుడు బండి దుర్గాప్రసాద్‌(బన్నీ)ను కఠినంగా శిక్షించాలంటూ అనకాపల్లి డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడినుంచి అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించారు. సమాజంలో చులకనగా చూడబడుతున్న ట్రాన్స్ జెండర్ లకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తయారుచేసి జీవో ఇవ్వాలని కోరారు. దీపు నేను హత్య చేసిన బన్నీని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. బన్నీ బ్యానర్లను హిజ్రాలు కాళ్ల కింద వేసి తొక్కుతూ ఆగ్రహంతో ఊడిపోయారు. 

అసలేం జరిగిందంటే..

అనకాపల్లిలో రెండు కాళ్లు, చేతులు నరికిన మహిళ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. ఆమెను హత్య చేసిన తర్వాత బెడ్ షీట్ లో రెండు చేతులు, రెండు కాళ్లను కట్టేసి పడేశారు. మహిళను హత్య చేసి, శరీర భాగాలు వేరు చేసి పడేసారని గుర్తించారు. ఆ మహిళ హత్యను పోలీసులు చేధించారు. కాగా హత్యకు గురైన వ్యక్తి హిజ్రాగా గుర్తించారు. మిగిలిన డెడ్ బాడీలోని అవయవభాగాలను అనకాపల్లి డైట్ కాలేజీ సమీపంలో పోలీసులు గుర్తించారు. ఈ మిస్టరీ కేసును పోలీసులు 8 బృందాలుగా వెళ్లి దర్యాప్తు చేపట్టారు. హత్య ఎందుకు జరిగింది అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగు చూశాయి.

Also Read: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!

అతను నాలుగేళ్లుగా బన్నీ అనే వ్యక్తితో గుట్టుగా మునగపాక మండలం నాగులాపల్లి లో నివాసం ఉంటూ సహజీవనం సాగిస్తున్నట్లు తెలిసింది. దీపు సహజీవనం చేస్తున్నట్టు తోటి హిజ్రాలకు కూడా తెలియకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తుంది. కాగా బన్నీనే హిజ్రాను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరి మధ్య తలెత్తిన తగాదాలు హత్య కు దారి తీసి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. దీపు చాలాకాలంగా హిజ్రా కమ్యూనిటీకి దూరంగా ఉంటుందని తోటి హిజ్రాలు తెలిపారు. హిజ్రా హత్యలో నిందితుడు బన్నీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలనం...వారిద్దరికీ రెడ్‌కార్నర్‌ నోటీస్‌

(anakapalli | transgender | murder | telugu-news | today telugu news | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు