/rtv/media/media_files/2025/03/19/xcHZ1OU4RfYk9Io0D28I.jpg)
ఏపీలోని ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరితో ఏప్రిల్ 7 నుంచి సేవలు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందజేసినట్లు అసోసియేషన్ తెలిపింది.
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ 26 సార్లు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు సీఈవో ను , వైద్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీని,ఐటీ శాఖ మంత్రిని ముఖ్యమంత్రిని కలిసి తమ ఇబ్బందులను వివరించినట్లు తెలిపారు.అయినప్పటికీ తమ సమస్యల పట్ల సానుకూల స్పందన కొరవడటంత , ఆస్పత్రులను తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయి నిర్వహించలేని దయనీయ స్థితిలో ఉన్నందున..వచ్చే నెల 7 నుంచి పూర్తిగా సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆఫా అధ్యక్షుడు విజయ్ ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. పాత బకాయిల కోసం 10 నెలల్లో 26 సార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినట్లు.. అయినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని అసోసియేషన్ సభ్యులు చెప్పారు. ఇప్పటికే రూ.3,500 కోట్ల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం నుంచి బిల్లులు రావాల్సి ఉన్నట్లు చెప్పారు.
పాత బకాయిలు చెల్లించి, కొత్త బిల్లులు సకాలంలో చెల్లించే వరకు వైద్యసేవలు పునరుద్దరించమని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ అల్టిమేటం జారీ చేయడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అసోసియేషన్ సభ్యులతో చర్చలు జరిపేందుకు అధికారులు రెడీ అవుతోన్నట్లు తెలిసింది. పేదలకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని.. పెండింగ్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్లు సమాచారం.
arogyasri | aarogyasri-card | aarogyasri-scheme | ap-arogyasri | cancel | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates