Breaking: ఏపీలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి..

ఏపీలో బర్డ్‌ఫ్లూ వైరస్‌ మళ్లీ కలకలం రేపింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో బర్డ్‌ఫ్లూ మరణం నమోదైంది. స్థానిక బాలయ్య నగర్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూతో చనిపోయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు ధ్రువీకరించారు.

New Update
Australia: భారత్‌ నుంచి ఆస్ట్రేలియాకు బర్డ్‌ఫ్లూ కేసు-డబ్ల్యూహెచ్‌వో

Bird Flue

ఏపీలో తొలి బర్డ్‌ఫ్లూ మరణం కలకలం రేపింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూ తో ప్రాణాలు కోల్పోయింది. ICMR  కూడా బర్డ్‌ఫ్లూ కారణమని తేల్చింది. మార్చి 16న బాలిక మరణించగా.. కొన్ని పరీక్షల తర్వాత ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూతో మరణించిన మొదటి కేసు ఇదేకాగా.. ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. పచ్చి కోడి మాంసం తినడం, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల చిన్నారి చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు.

Also Read: Musk-Tesla Cars: టెస్లా షోరూంలో అగ్ని ప్రమాదం... 17 కార్లు దగ్ధం..వారి చర్యే అంటున్న మస్క్‌!

నరసరావుపేటకు చెందిన రెండేళ్ల చిన్నారి జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది. చిన్నారి ముక్కు కారడం, మూర్ఛ, విరేచనాలు, ఆహారం తినలేని పరిస్థితి ఎదురైంది. పాపను మార్చి 4న మంగళగిరిలోని ఎయిమ్స్‌కు తీసుకొచ్చారు. అక్కడ డాక్టర్లు ఆక్సిజన్ పెట్టి చికిత్స అందించినప్పటికీ లాభం లేకపోయింది. మార్చి 7న పాప గొంతు, ముక్కు నుంచి స్వాబ్ నమూనాలు తీసుకున్నారు. ఎయిమ్స్‌లోని వీఆర్‌డీఎల్‌లో పరీక్షించగా ఇన్‌ఫ్లుయెంజా ఎ పాజిటివ్‌గా తేలింది. అనంతరం మార్చి 15న మరోసారి శాంపిల్‌ను స్వీకరించి ఢిల్లీలో పరీక్షించారు. మార్చి 16న పాప చనిపోగా.. ఐసీఎంఆర్ అప్రమత్తమైంది. మార్చి 24న స్వాబ్ నమూనాలను పుణెలోని ఎన్‌ఐవీ కి పంపించగా.. అక్కడ హెచ్‌5ఎన్‌1 వైరస్‌గా తేల్చారు.

Also Read: Horoscope: నేడు ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు..

వైద్యారోగ్య శాఖ అధికారులు చిన్నారి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. బాలిక పెంపుడు కుక్కలు, వీధి కుక్కలతో ఆడుకునేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పాపకు ఫిబ్రవరి 28న జ్వరం వచ్చిందని.. అంతకు రెండు రోజుల ముందు పచ్చి కోడి మాంసం తిన్నట్లు చిన్నారి తల్లి వివరించింది. చికెన్ ని  కోసే సమయంలో పాప అడిగితే ఒక ముక్క ఇచ్చినట్లు..దానిని తిన్న తర్వాతే జబ్బు పడింది అన్నారు. గతంలోనూ ఓసారి ఇలాగే ఇచ్చామని.. ఉడికించిన మాంసం తిన్న తమకెవరికీ ఆరోగ్య సమస్యలు రాలేదన్నారు.

పల్నాడు జిల్లాలో ఎక్కడా బర్డ్‌ఫ్లూ వైరస్‌ వ్యాప్తి లేదని పశు సంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. బాధిత కుటుంబం ఇంటికి కిలోమీటరు దూరంలో మాంసం దుకాణం ఉందని గుర్తించారు. చిన్నారి ఇంటి దగ్గర వైద్య ఆరోగ్యశాఖ జ్వర సర్వే నిర్వహించింది. అనుమానిత లక్షణాలున్న వారు ఎవరూ లేరని తేల్చింది. ఇలాంటి కేసులేవీ నమోదు కాలేదని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వైద్యారోగ్య శాఖ ప్రత్యేక అధికారి నరసరావుపేటకు వెళ్లి కుటుంబ సభ్యులను, స్థానికులను ప్రశ్నించారు.

Also Read: Trump-America:ఈ సారి ట్రంప్‌ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!

Also Read: Gold Rates: తాట తీస్తున్న బంగారం..10 గ్రాములు రూ.94 వేలతో సరికొత్త రికార్డ్

gunturu | ap | bird-flue | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment