ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు.. ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై స్టే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చింది హైకోర్టు. అమరావతి ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం..

New Update
AP High Court:చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణను వాయిదా వేసిన హైకోర్టు

Andhra Pradesh High Court stay on Amaravati R5 Zone Houses : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చింది హైకోర్టు. అమరావతి ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు(AP High Court) స్టే ఇచ్చింది. ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది.

అమరావతిలోని ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలంటూ దాఖలైన వ్యాజ్యాలకు సంబంధించి హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో అనుబంధ పిటిషన్లపై నిర్ణయాన్ని వెల్లడించేందుకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. ఇటీవల తీర్పును రిజర్వ్ చేయగా.. ఇవాళ తీర్పును వెల్లడించింది.

కాగా ఆర్-5 జోన్(Amaravati R5 Zone Houses) లో జగనన్న కాలనీల పేరుతో ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇవ్వాలని ఉద్దేశ్యంతో ఇళ్ల పట్టాలను అందజేసింది. రాజధాని ప్రాంతంలో సుమారు 14 వందల ఎకరాల మేర పంపిణీ చేసింది. అమరావతిలో 50,793 మందికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ ఏడాది మే 26వ తేదీన ఉచితంగా ఇళ్ల నిర్మాణ పత్రాలు మంజూరు చేసింది. అలాగే సీఎం జగన్ కూడా శంకుస్థాపన చేశారు.

అయితే ఇది ఎలక్ట్రానిక్ సిటీ కాబట్టి ఇక్కడ కాకుండా మరోచోట ఇవ్వాలంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ రాజధాని ప్రాంతంలో 5 శాతం పేదలకు ఇళ్లు కట్టునేందుకు జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని.. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం ఇక్కడ జరగడం లేదని కోర్టుకు విన్నవించుకున్నారు. మరి ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ పై అధికార వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

Also Read: ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే.. అసలు ఇంతకీ ఆర్-5 జోన్ అంటే ఏమిటి?

Advertisment
Advertisment
తాజా కథనాలు