Big Breaking: ఆలేరు ఎమ్మెల్యే సునీతకు హైకోర్టు షాక్

ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి హైకోర్టు 10వేల రూపాయల జరిమానా విధించింది. 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయంలో ఎమ్మెల్యే సునీత ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించ లేదంటూ ఆమెపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

New Update
Big Breaking: ఆలేరు ఎమ్మెల్యే సునీతకు హైకోర్టు షాక్

ఆలేరు ఎమ్మెల్యే గోంగిడి సునీత మహేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్ తగిలింది. సునీత మహేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు రూ. 10వేల జరిమానా విధించింది. 2018 ఎన్నికల అఫీడవిట్ లో ఆస్తులను చూపకుండా, తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు అయింది.

కాగా, ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారు. అయితే, ఎమ్మెల్యే సునీత ఇప్పటివరకు ఈ కేసులో కౌంటర్ దాఖలు చెయ్యలేదు. దీనిని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు ఆమెకు జరిమానా విధించింది. అక్టోబర్ 3లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిలోపు కౌంటర్ దాఖలు చెయ్యకపోతే ఆ తర్వాత అవకాశం ఉండదని స్పష్టం చేసింది. గొంగిడి సునీత ఎన్నిక చెల్లదని సైని సతీష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఇంతకు ముందు ఇలాగే మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. 2018 ఎన్నికల సమయంలో వనమా వెంకటేశ్వర రావు తన ఆస్తి వివరాలన్నింటిని ఎన్నికల అఫిడవిట్ లో జత పరచలేదని ప్రత్యర్థి అభ్యర్థి జలగం వెంకట్రావు 2019 నుంచి న్యాయపోరాటం చేస్తే వనమా ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఎన్నికల్లో జలగం వెంకట్రావుదే విజయం గా పేర్కొని, ఆయనను ఎమ్మెల్యేగా తెలిపింది. అయితే.. వనమా ఈ కేసు విషయమై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట లభించింది. కోర్టు స్టే ఇవ్వడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు.

ఇవికూడా చదవండి:జగన్ సర్కార్ కు కాగ్ చురకలు.. నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కూడా..

చంద్రబాబు బెయిల్, కస్టడి పిటిషన్లపై విచారణ వాయిదా.. మరికొన్ని రోజులు జైలులోనే?

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా నారా లోకేష్.. అరెస్ట్ తప్పదా?

కోమటిరెడ్డికి షాక్ ఇచ్చిన ఉత్తమ్, రేవంత్.. నల్లగొండ కాంగ్రెస్ లో అసలేం జరుగుతోంది?   

Advertisment
Advertisment
తాజా కథనాలు