కొంపముంచిన రీల్‌ వీడియో.. కటకటాల్లోకి తల్లీకూతుళ్లు..

సోషల్ మీడియా మోజులో పడి చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరు రీల్స్‌ చేస్తున్నారు. ఇలా రీల్స్ చేస్తూ చాలామంది తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలన్న ఆశతో డేంజర్‌ స్టంట్స్ చేస్తున్నారు. ఇక యువత అయితే రీల్స్‌తో తోటివారికి ఇబ్బంది కలిగిస్తుంటారు. ఇలాంటి ఘటనల్లో నిషేధ ప్రదేశాల్లోనూ రీల్స్‌ చేస్తూ జైలు పాలయిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఆగ్రా ఫోర్ట్ రైల్వే స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

New Update
కొంపముంచిన రీల్‌ వీడియో.. కటకటాల్లోకి తల్లీకూతుళ్లు..

Agra-railway-police-daughter-mother-reels-arrest-145-147-sections-case-file

ప్రమాదకరమైన రీల్స్‌ చేయొద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్న చాలామంది రీల్స్ చేసేవారు వాటన్నింటిని లైట్ తీసుకుంటున్నారు. తాజాగా.. అలాంటి ఘటనే ఆగ్రాలో జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే.. ఓ తల్లీ కూతుళ్ల రైల్‌ రీల్‌ స్టోరీ ఆఖరికి కటకటాల వెనక్కి నెట్టేసింది. తల్లి డ్యాన్స్ చేస్తుండగా.. కూతురు మొబైల్‌లో వీడియోను రికార్డు చేసింది. చేస్తే చేసింది గానీ.. ఆ రీల్‌ని ఏ గట్టు వెంబడో.. ఏ చెరువు వెంబడో చేస్తే బాగుండేది. అలా చేస్తే ప్రపంచం గుర్తించదు అనుకున్నదో ఏమో.. ఏకంగా రైల్వే స్టేషన్‌ని ఎంచుకుంది. రైల్వే ట్రాక్ పై తన రీల్‌ని తల్లి స్టార్ట్ చేసింది కూతురు రికార్డు చేసింది.

ట్రాక్‌పై స్టెప్పులు వేస్తూ..

'అబ్ తేరే బిన్ హమ్ భీ జీ లేంగే' అనే సాంగ్‌కు ట్రాక్‌పై స్టెప్పులు వేస్తూ ఉంటే.. కూతురు మాత్రం ఎంచక్కా.. చాలా జాగ్రత్తగా ఆ వీడియోను తన మొబైల్‌లో రికార్డు చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కాస్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ కావడంతో.. నెటిజన్స్ వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోరడంతో పోలీసులు సదరు మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా రైల్వే చట్టం 145, 147 పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

తల్లీకూతుళ్లు కటకటాల పాలు..

రీల్ షూటింగ్‌లో సహకరించిన ఆమె కుమార్తెను ఆగ్రా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. వీరిద్దరూ మరోసారి ఇలాంటివి పునరావృతం చేయమని హామీ ఇవ్వడంతో వారిని బెయిల్ పై విడుదల చేశారు. ఈ ఘటన ఆగ్రా ఫోర్ట్ రైల్వే స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. దేశంలో రైల్వే ప్రాంగణాల్లో షూటింగ్ చేయాలంటే సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి అని తెలిపారు. అయితే రైలు పట్టాలు, రైలు పైకప్పులు వంటి ప్రాణాంతక ప్రదేశాలలో చిత్రీకరణ పూర్తిగా నిషేధించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Uttar Pradesh: ఫస్ట్ నైట్‌లో వధువు వింత కండీషన్.. గజగజ వణికిపోయిన వరుడు!

ఉత్తరప్రదేశ్‌లో ఓ వరుడికి మొదటి రాత్రే వధువు షాక్ ఇచ్చింది. శోభనం రాత్రి నన్ను ముట్టుకోవద్దు.. ముట్టుకున్నావంటే విషం తాగి చచ్చిపోతానని వరుడికి బెదిరించింది. ఎంత నచ్చజెప్పినా కూడా వధువు వినిపించుకోలేదు. దీంతో వరుడు పోలీసులను ఆశ్రయించాడు.

New Update
Marriage

Uttar pradesh

ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. పెళ్లి జరిగి కనీసం ఒక రోజు కాకుండానే భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. ఎంతో పవిత్రమైన పెళ్లిని పెటాకులు చేస్తున్నారు. అయితే ఇలాంటి ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లా బారాదరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తికి యువతితో పెళ్లి జరిగింది.

ఇది కూడా చూడండి: USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

పెళ్లికి ముందే ఓ అబ్బాయిని..

కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఘనంగా పెళ్లి చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు శోభనం ఏర్పాటు చేశారు. దీంతో మొదటి రాత్రే వధువు చేసిన పనికి వరుడు గజ గజ వణికి పోయాడు. శోభనం గదిలో వధువు వరుడికి ఓ వింత కండీషన్ పెట్టింది. నన్ను ముట్టుకోవద్దు.. ముట్టుకున్నావంటే విషం తాగి చచ్చిపోతానని బెదిరించింది. వరుడు ఎంత నచ్చజెప్పిన కూడా వధువు వినిపించు కోలేదు. టచ్ చేయవద్దని బెదిరించింది. 

ఇది కూడా చూడండి: WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

చివరకు వరుడు అడగ్గా.. పెళ్లికి ముందే ఓ యువకుడిని ప్రేమించానని ఇప్పటికీ కూడా అతన్నే ప్రేమిస్తున్నానని, తనే నా భర్త అని తెలిపింది. దీంతో ఒక్కసారిగా ఆ యువకుడు షాక్ అయి కుటుంబ సభ్యులకు తెలిపాడు. అయితే ఆ వధువు ఏ మాత్రం కూడా వినకపోయే సరికి వరుడు పోలీసులను ఆశ్రయించాడు. వధువుతో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

ఇది కూడా చూడండి: Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

 

marriage | uttar-pradesh | national news in Telugu | today-news-in-telugu | latest-telugu-news | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment