NEET: నీట్‌ పరీక్షను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన మరో రాష్ట్రం..

నీట్‌ పరీక్షను వ్యతిరేకిస్తూ ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయగా.. తాజాగా పశ్చిమ బెంగాల్‌ కూడా అలాంటి చర్యలు చేపట్టింది. నీట్‌ పరీక్షను రద్దు చేసి గతంలో ఉన్న పద్ధతినే అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.

New Update
NEET: నీట్‌ పరీక్షను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన మరో రాష్ట్రం..

దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో యూజీ ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ పరీక్షను వ్యతిరేకించే రాష్ట్రాల జాబితాలో మరో రాష్ట్రం చేరింది. దీనిపై ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయగా.. తాజాగా పశ్చిమ బెంగాల్‌ కూడా అలాంటి చర్యలు చేపట్టింది. నీట్‌ పరీక్షను రద్దు చేసి గతంలో ఉన్న పద్ధతినే అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.

Also Read: పేపర్‌ లీక్స్ అరికట్టేందుకు బిహార్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం..

నీట్‌ ద్వారా మెడికల్ కళాశాలల్లో తమ స్డూడెంట్స్‌ను చేర్చుకోకుండా రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేసింది. నీట్ అమలుకు ముందు ఉన్న 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాలకు పర్మిషన్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. నీట్‌ పేపర్‌ లీక్ సంచలనం రేపిన వేళ.. సుప్రీంకోర్టు మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన మరుసటి రోజే పశ్చిమ బెంగాల్‌లో ఈ పరిణాం చోటచేసుకోవడం చర్చనీయాంశమవుతోంది.

Also Read: మరో రెండ్రోజుల్లో పారిస్‌ ఒలింపిక్స్‌.. బరిలోకి భారత్‌ నుంచి 14 ఏళ్ల బాలిక

Advertisment
Advertisment
తాజా కథనాలు