INDIA : ఇండియా కూటమిలో లుకలుకలు.. మమతా టార్గెట్‌గా కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు! పశ్చిమ బెంగాల్‌లో ఆ రాష్ట్ర కాంగ్రెస్ లీడర్ అధిర్ రంజన్ చౌధ్రీ.. సీఎం మమతా బెనర్జీపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం సంయమనం పాటించమని చెప్పినా కూడా అంగీకరించనన్నారు. మల్లికార్జున ఖర్గే నా అభిప్రాయాలకు వ్యతిరేకంగా స్పందించినా కార్యకర్తలవైపే మాట్లాడుతానన్నారు. By B Aravind 19 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Mamatha : పశ్చిమ బెంగాల్ (West Bengal) లో ఇండియా కూటమి (India Alliance) మిత్రపక్షాల మధ్య పోరు సాగుతోంది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ (Congress) లీడర్ అధిర్ రంజన్ చౌధ్రీ.. సీఎం మమతా బెనర్జీ (Mamatha Banerjee) పై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం సంయమనం పాటించమని చెప్పినా కూడా.. అంగీకరించనన్నారు. మమతా బెనర్జీ గురించి ఎట్టి పరిస్థితుల్లో కూడా సానుకూలంగా మాట్లాడలేనని అన్నారు. అయితే గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించిన గంటలోపే అధిక్ రంజన్ ఈ ప్రకటన చేశారు. Also read: త్వరలో ముఖ్యనేతలు అరెస్ట్.. సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు 'నన్ను, నా పార్టీని(కాంగ్రెస్)ను రాష్ట్రంలో రాజకీయంగా అంతం చేయాలనుకునే వారి గురించి అస్సలు సానుకూలంగా మాట్లాడను. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కోసం పోరాడుతూ.. వాళ్ల వైపే మాట్లాడుతా. మమతా బెనర్జీపై వ్యక్తిగత కక్ష లేదు. ఆమె రాజకీయ నైతికతను ప్రశ్నిస్తాను' అంటూ అధిర్ రంజన్ అన్నారు. ఒకవేళ మల్లికార్జున ఖర్గే నా అభిప్రాయాలకు వ్యతిరేకంగా స్పందించినా కూడా నేను మాత్రం క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తల కోసం మాట్లాడుతూ ఉంటానని తెలిపారు. అంతకు ముందు మాట్లాడుతూ కూడా ఇండియా కూటమి నుంచి పారిపోయిన మమతా బెనర్జీని నమ్మలేమంటూ వ్యాఖ్యానించారు. ఆమె బీజేపీతో కలిసారంటూ ఆరోపణలు చేశారు. ఝార్గ్రామ్, పురులియా, బంకురా స్థానాల్లో లెఫ్ట్ పార్టీలను ఓడించేందుకు మమతా.. మావోయిస్టుల సాయం తీసుకున్నారని అన్నారు. దీనిపై స్పందించిన ఖర్గే.. మమతా బెనర్జీ ఇండియా కూటమితోనే ఉన్నారని తెలిపారు. ప్రభుత్వంలో ఆమె చేరాలా వద్దా అనే దానిపై అధిర్ రంజన్ నిర్ణయం తీసుకోలేకని.. నేను, పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తామని అన్నారు. ఇది ఇష్టం లేనివారు బయటకు వెళ్లిపోవచ్చంటూ కఠినంగా మాట్లాడారు. మరోవైపు టీఎంసీ ప్రతినిధి కునాల్ ఘోష్.. తమ పార్టీ ఇండియా కూటమిలోనే ఉందని పేర్కొన్నారు. అధిర్ రంజన్ తరచూ మమతను విమర్శిస్తూ.. బీజేపీకి ప్రాణవాయువు అందిస్తున్నారంటూ చురకలంటించారు. Also read: సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసే డేట్, ప్లేస్ ఇదే.. వైసీపీ సంచలన ప్రకటన! #telugu-news #national-news #bjp #india-alliance #tmc #mamata-benarjee మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి