Tollywood: మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట.. కీలక ఆదేశాలు!

జర్నలిస్ట్ పై దాడి కేసులో నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట లభించింది. ముందస్తు బెయిల్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. నాలుగు వారాలకు కేసు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. తదుపరి విచారణ వరకు మోహన్ బాబు పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.

New Update
Mohan Babu

Mohan Babu

Mohan Babu :  నటుడు మోహన్ బాబుకు (Mohan Babu) సుప్రీం కోర్టులో స్వల్ప ఊరట లభించింది. జర్నలిస్టు పై దాడి కేసులో ముందస్తు బెయిల్  కోరుతూ  హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా..  విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు గత నెల 23న బెయిల్ పిటీషన్ ని కొట్టివేసింది. ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని చెప్పింది. దీంతో మోహన్ బాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.  నేడు వాదోపవాదనలు విన్న సుప్రీం కోర్టు మోహన్ బాబుకు..  నాలుగు వారాల వరకు కేసు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.  తదుపరి విచారణ వరకు మోహన్ బాబు పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. అలాగే మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలో ముందస్తు బెయిల్ జడ్జిమెంట్ ఇస్తామని స్పష్టం చేసింది. ధర్మాసనం. 

Also Read: Tripti Dimri: వైట్ బాడీకాన్ గౌనులో త్రిప్తి అందాల విధ్వంసం..! చూస్తే ఫిదా - Rtvlive.com

మోహన్ బాబుకు ధర్మాసనం ప్రశ్నలు 

విచారణలో భాగంగా ధర్మాసనం మోహన్ బాబును..  ఇంట్లోకి వచ్చినంత మాత్రాన జర్నలిస్టుపై దాడి చేస్తారా? నష్టపరిహారం చెల్లిస్తారా? లేదా జైలుకు పంపాలా?  అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీనికి మోహన్ బాబు తరుపున న్యాయవాది కౌన్సిల్ ముకుల్ రోహిత్గి  తన వైపు వాదనలను వినిపించారు. ఆయన కొడుకుతో గొడవల సందర్భంగా ఈ సంఘటన జరిగింది. జర్నలిస్టు పై దాడికి మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. 76 ఏళ్ళ వయసున్న ఆయన కావాలని చేయలేదు.. ఆవేశంలో జరిగింది. నష్ట పరిహారం చెల్లించేందుకు కూడా  సిద్ధంగా ఉన్నారని తరుపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. 

Also Read :  మహారాష్ట్రలో ఘోరం.. రూ. 500 కోసం సొంత తమ్ముడి హత్య.. అసలేం జరిగిందంటే ?

మరో వైపు జర్నలిస్టు తరపు వాదనలు కూడా వినిపించారు. జర్నలిస్ట్ 5 రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నారని. నెలరోజులుగా పైపు ద్వారానే ఆహరం తీసుకుంటున్నాడని.. తన పై దాడి చేయడమే కాకుండా కించపరిచారని. వృత్తి పరంగా తన కెరీర్ నష్టపోయిందని వాదించారు. ఇలా ఇరు వైపు వాదనలు విన్న న్యాయస్థానం కేసు నాలుగు వారాలకు వాయిదా వేస్తూ.. తీర్పను తదుపరి విచారణలో వెల్లడించనున్నట్లు తెలిపింది. 

ఇది కూడా చూడండి:  తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్‌ ది సీన్స్! ట్రైలర్ చూశారా

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Manchu Lakshmi - Manoj: అక్కా ఏడవకే.. మనోజ్‌ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మి - VIDEO

ఫ్యామిలీ వివాదాలతో సతమతమవుతున్న తమ్ముడు మంచు మనోజ్‌ని ఓ ఫంక్షన్లో చూసి మంచు లక్ష్మి ఏడ్చేసింది. ఆమె స్టేజ్‌పై ఉన్న సమయంలో మనోజ్ దంపతులు వెళ్లారు. వారిని చూడగానే లక్ష్మి కంటనీరు పెట్టుకుని ఎమోషనల్ అయింది. పక్కనే ఉన్న మౌనిక అక్కా తమ్ముళ్ళను ఓదార్చింది.

New Update
manchu lakshmi gets emotional over seeing manchu manoj

manchu lakshmi gets emotional over seeing manchu manoj

అక్కా తమ్ముళ్ల బంధం ఎన్నటికీ వీడనిది.. విడదీయలేనిది. ఎన్ని గొడవలు జరిగినా.. తిరిగి మళ్లీ ఒక్కటి కావాల్సిందే. అదే మరోసారి నిజమైంది. మంచు ఫ్యామిలీలో  గత కొన్నాళ్లుగా వివాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా మంచు ఫ్యామిలీ గొడవలు చెలరేగాయి. పోలీస్ స్టేషన్ వరకు చేరుకున్నాయి. అక్కడితో ఆగలేదు. ఆఖరికి కోర్టు మెట్లు కూడా ఎక్కారు. 

Also Read :  కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు- మంచు మనోజ్ మరోవైపు. సినిమాను తలపించేలా వీరి వివాదం నడిచింది. ఇప్పటికీ వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలు జరుగుతున్నాయి. ఇది ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఆ మధ్య వీరు ఒకరినొకరు తిట్టుకుని.. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు కాస్త సైలెంట్ అయ్యారు. 

Also Read :  'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

కానీ ఇప్పుడు మరోసారి మంచు ఫ్యామిలీలో చిచ్చు రాజుకుంది. మంచు మనోజ్ మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశాడు. తన కార్లను విష్ణు దొంగిలించాడంటూ తన తండ్రి మోహన్ బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగాడు. కూతురి పుట్టినరోజు వేడుకల కోసం రాజస్థాన్ వెళ్లిన వెంటనే మంచు విష్ణు ఈ చోరీకి పాల్పడ్డాడని మనోజ్ ఆరోపణలు చేశాడు. ఇప్పుడు ఇదే రచ్చ కొనసాగుతోంది. 

Also Read :  ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..

ఇలా వరుస వివాదాలతో మంచు ఫ్యామిలీకి కంటి మీద కునుకు లేకుండా పోయింది. మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఈ వివాదాలపై నోరు విప్పేందుకు ఇష్టపడటం లేదు. అయితే మంచు లక్ష్మికి తమ్ముడు మనోజ్‌ మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు నడుస్తున్నాయి. గతంలో ఆమె ముంబై నుంచి వచ్చి గొడవలను సరిచేయాలని చూసింది. కానీ ఆమె మాట ఎవరూ వినలేదని.. అక్కడ నుంచి వెంటనే మళ్లీ ఆమె వెళ్లిపోయిందని వార్తలు వినిపించాయి. 

Also Read :  'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి

అక్కా తమ్ముళ్ల అనుబంధం

ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి, తమ్ముడు మంచు మనోజ్ కలిసారు. ‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే వార్షిక ఫండ్‌రైజర్ కార్యక్రమాన్ని మంచు లక్ష్మి ఏర్పాటు చేసింది. అందులో తన కూతురితో కలిసి ర్యాంప్ వాక్ చేసింది. అదే సమయంలో మంచు లక్ష్మి స్టేజ్ మీద ఉండగానే.. వెనుక నుంచి మంచు మనోజ్ దంపతులు సర్‌ప్రైజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా తమ్ముడు మనోజ్‌ను చూసిన మంచు లక్ష్మీ మనసారా హత్తుకుని ఏడ్చేసింది. దీంతో పక్కనే ఉన్న మనోజ్ భర్య ఆమెను ఓదార్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసి నెటిజన్లు.. అక్కా తమ్ముళ్ల అనుబంధం విడదీయలేనిది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

(manchu-manoj | manchu lakshmi | manchu family | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment