Chittor: మా ఆయన శవం నాకు కావాలి.. కొట్టుకున్న ఇద్దరు భార్యలు

భర్త మృత దేహం కోసం ఇద్దరు భార్యలు కొట్టుకునే ఘటన చిత్తూరులో జరిగింది. చిత్తూరుకి చెందిన డీఈ సుబ్రహ్మణ్యానికి ఇద్దరు భార్యలు ఉన్నారు. అనారోగ్య సమస్యలు వచ్చి సుబ్రహ్మణ్యం మృతి చెందాడు. దీంతో మొదటి భార్య, రెండో భార్య తమకు మృతదేహం కావాలని గొడవ పడ్డారు.

New Update
Medak : మెదక్ లో విషాదం.. ఇంటి పైకప్పు కూలి వృద్ధురాలి మృతి..!

Chittor

ఈ రోజుల్లో కొందరు కొడుకులు కన్న తండ్రి మృత దేహం దగ్గర కూడా గొడవలు పడుతున్నారు. నాకు వద్దంటే వద్దని కొందరు శవాన్ని నడిరోడ్డు మీద వదిలేస్తున్నారు. రోజురోజుకీ ఈ సమాజంలో మానవత్వం చచ్చిపోతుంది. అయితే చిత్తూరులో భర్త మృతదేహం కోసం ఇద్దరు భార్యలు గొడవపడిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నారాయణవనం మండలంలోని చిత్తూరు కండ్రిగలో విశ్రాంత ట్రాన్స్‌కో డీఈ సుబ్రహ్మణ్యం ఉంటున్నాడు.

ఇది కూడా చూడండి: గవర్నమెంట్ టీచర్ : దొరికినకాడికి దోచేసి అడ్డంగా బుక్కయ్యాడు.. సారూ మామూలోడు కాదు!

చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే..

ఇతను గత మూడేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే ఇతనికి ఇద్దరూ భార్యలు ఉన్నారు. మొదటి భార్య తిరుపతిలో ఉండగా.. రెండవ భార్య చిత్తూరులో ఉంటుంది. ఇటీవల సుబ్రహ్మణ్యం పరిస్థితి విషమించడంతో రెండు భార్య, కుమారుడు అతన్ని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సుబ్రహ్మణ్యం అక్కడే మృతి చెందాడు.

ఇది కూడా చూడండి: Mastan Sai : డ్రగ్స్ ఇస్తాడు.. న్యూడ్ వీడియోలు తీస్తాడు..  మస్తాన్ మాములోడు కాదయ్యా!

ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య, కొడుకు అక్కడికి చేరుకుని, మృత దేహాన్ని తనకి అప్పగించాలని కోరారు. రెండో భార్య మృతదేహాన్ని తనకే అప్పగించాలని కోరింది. ఇద్దరు భార్యలు అక్కడ గొడవ పడ్డారు. కాస్త అయితే కొట్టుకునే వరకు వెళ్లేవారు. ఇంతలో పోలీసుల వచ్చిన వారికి సర్ది చెప్పారు. ఇద్దరు చర్చించుకున్న తర్వాత వస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. సొంత తల్లిదండ్రుల మృతదేహాలను డబ్బుల కోసం రోడ్డు మీద వదిలేస్తున్నారు. కానీ భర్త మృతదేహం కోసం ఇద్దరు భార్యలు ఇలా గొడవ పడటంతో కొందరు వారిని అభినందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: అప్పర్ సర్క్యూట్‌ను తాకిన వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్.. షేర్ ఎంత శాతం పెరిగిందంటే?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

విషాదం.. చపాతీలతో తల్లీ కొడుకుకి అస్వస్థత.. ఆ తర్వాత ఏమైందంటే?

తెలంగాణలో చపాతీలు తిన్న వెంటనే తల్లీ కొడుకు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. పుడ్ పాయిజన్ కారణమని కొందరు, మరికొందరు అత్తింటి వేధింపులు భరించలేక చనిపోయిందని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

New Update
Rajanna siricilla

Rajanna siricilla Photograph: (Rajanna siricilla)

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రుద్రంగి మండలంలో ఓ తల్లి కొడుకు చపాతీలు తిన్న వెంటనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. తల్లి కొడుకు ఇద్దరూ కూడా చికిత్స తీసుకుంటూ.. మృతి చెందారు. తల్లీకొడుకులు చనిపోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చూడండి: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

అత్తింటి వేధింపులు భరించలేక..

వీరి మృతికి పుడ్ పాయిజన్ కారణం అయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరికొందరు అత్తింటి వేధింపులు భరించలేక చనిపోయిందని మృతిరాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త చోటుచేసుకుంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

ఇదిలా ఉండగా ఇటీవల బెట్టింగ్ వల్ల ఓ యువకుడు మృతి చెందాడు. కాకినాడ జిల్లా తుని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బెట్టింగ్‌కు బానిసైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్ వేస్తూ అప్పుల్లో కూరుకుపోయిన కొలనాటి మరణబాబు రైలు కింద పడి చనిపోయాడు. మృతుడు అనకాపల్లి జిల్లా నక్కపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్. రమణబాబు ఉద్దండపురం గ్రామంలో ఉంటూ వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు.

ఇది కూడా చూడండి: Telangana: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

సోమవారం రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రమణబాబు పూర్తిగా బెట్టింగ్‌కు బానిసై జీతం డబ్బులు కూడా ఇంటికి ఇవ్వకపోయేది. బెట్టింగ్స్ వేస్తూ అప్పులపాలైన రమణబాబు అప్పుల బాధ బరించలేక ఇక తనకు చావే దిక్కనుకున్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

Advertisment
Advertisment
Advertisment