GAZA: ఇజ్రాయెల్ మీద హమాస్ ఎదురుదాడి..8 మంది సైనికులు మృతి హమాస్ ఫైటర్లు జరిపిన దాడిలో ఎనిమిది మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ స్వయంగా ధృవీకరించింది. పేలుడు కారణంగా వారు మరణించారని చెప్పింది. By Manogna alamuru 16 Jun 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Israel - Hamas War: గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా దక్షిణ గాజాలో ఇజ్రాయెల్‌కు ఎదరుదెబ్బ తగిలింది. హమాస్ జరిపిన దాడుల్లో తమ సైనికులు ఎనిమిది మంది మరణించారని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతి చెందిన వారిలో కంబాట్ ఇంజినీరింగ్ కార్ప్‌కు చెందిన డిప్యూటి కంపెనీ కమాండర్ వాసీం మహమూద్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో గాజాలో (Gaza) హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడిలో ఒకేసారి 21 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. దాని తర్వాత సైనికులు భారీ సంఖ్యలో చనిపోవడం ఇదే. హమాస్‌తో (Hamas) యుద్ధంలో ఇప్పటివరకు మొత్తం 307 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. గాజాలో పగటి యుద్ధం ముగిసిన తర్వాత విశ్రాంతి కోసం వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. కాన్వాయ్ మీద బాంబు వేసినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా పేలుడు సంభవించిందని..దాంతో పేలుడుతో ఆర్మర్డ్ కంబాట్ ఇంజినీరింగ్ వెహికల్ (CEV)లో ఉన్న సైనికులు చనిపోయారని అక్కడి మీడియా తెలిపింది. అంతకు ముందే హమాస్ ఇజ్రాయెల్ సైనికులు చనిపోయిన విషయాన్ని ప్రకటించింది. దక్షిణ రఫాలోని టెల్ అల్ సుల్తాన్ ప్రాంతంలో సైనికులతో వెళ్తున్న వాహనాన్ని తమ ఫైటర్లు పేల్చివేసినట్లు పేర్కొంది. మరోవైపు రఫాని (Rafa) గుప్పిటలో ఉంచుకునేందుకు ఇజ్రాయెల్ దళాలు గత కొన్ని వారాలుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో శనివారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో 19 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. రఫాలో హమాస్ నిర్మించిన సొరంగాలను గుర్తించి భారీ ఎత్తు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ చెప్పింది. Also Read: TCS: టీసీఎస్‌కు రూ.1600కోట్లు జరిమానా #israel #hamas #gaza #war #israel-hamas-war మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి