Himachal Pradesh: ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు.. హిమాచల్‌ప్రదేశ్‌లోని రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ అభ్యర్థులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకు.. స్పీకర్ కుల్దీప్ సింగ్ పంథానియా వారిపై అనర్హత వేటు విధించారు. కాంగ్రెస్ తరఫున గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారనే కారణంతో వారిని ఎమ్మెల్యే సభ్యత్వం నుంచి తొలగించారు. By B Aravind 29 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి 6 Congress Rebel MLAs Disqualified: హిమాచల్‌ప్రదేశ్ రాజ్యసభ ఎన్నిక్లలో కాంగెస్ పార్టీ క్రాస్ ఓటింగ్ పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పంథానియా (Speaker Kuldeep Singh) వారిని ఎమ్మెల్యే సభ్యత్వం నుంచి తొలగించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) తరఫున గెలిచి.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. Also Read: దేశ విభజన వ్యాఖ్యలపై నిర్మలా ఫైర్.. ఏమన్నారంటే సరిసమానంగా ఓట్లు బీజేపీకి (BJP) అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసిన ఆ ఎమ్మెల్యేలు తిరుగుబావుటా చేయడంతో స్పీకర్ కుల్దీప్ సింగ్ పంథానియా ఈ చర్య తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో మొత్తం 15 రాజ్యసభ స్థానాలకు (Rajya Sabha Seats) మంగళవారం ఓటింగ్ జరిగింది. అయితే హిమాచల్ ప్రదేశ్‌లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ పాల్పడటం వల్ల కాంగ్రెస్ అభ్యర్థికి.. అలాగే బీజేపీ అభ్యర్థికి సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో టాస్ వేయడంతో బీజేపీ అభ్యర్థిని విజయం సాధించారు. మంత్రి విక్రమాదిత్య రాజీనామా ఈ సమయంలోనే మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామా చేయడం కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో అసెంబ్లీలో అవిశ్వాస తీర్మాన ప్రవేశపెట్టేందుకు బీజేపీ ప్రతినిధి వర్గం గవర్నర్ శివ్ ప్రతాబ్ శుక్లాను కలిసినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా.. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్ 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద క్రాస్ ఓటింగ్ చేసినందుకు ఆరుగురు ఎమ్మెల్యేలపై తాజాగా అనర్హత వేటు వేయడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. Also Read: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. కోటి గృహాలకు ఫ్రీ కరెంట్ #telugu-news #congress #bjp #himachal-pradesh #rajya-sabha-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి