/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/sharmila-1-1.jpg)
Ap Politics: ఏపీలో సోమవారం సాయంత్రంతో ఎన్నికల హడావిడి ప్రశాంతంగా ముగిసింది. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున వైఎస్ షర్మిల బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ఏపీ ప్రజలనుద్దేశించి ఓ ట్వీట్ చేశారు. ''గడిచిన కొన్ని వారాలుగా, పగలనకా, రేయనకా, కష్టాల కోర్చి, బాధలను మింగి, సవాళ్లకు ఎదురు నిలిచి, నన్ను నమ్మి, రాజశేఖర బిడ్డగా, మీ గొంతుగా నన్ను ఆదరించి, నా ఈ పోరాటంలో నాతో కలిసి నడిచిన కాంగ్రెస్ కార్యకర్తలు,నేతలు,ఈ ఎన్నికల మహాయజ్ఞంలో ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన ఓటరు మహాశయులకు, శాంతిభద్రతలు సజావుగా సాగేలా చూసిన పోలీసువారికీ , నా అనుచరులూ, అభిమానులూ, ఆప్తులు, స్నేహితులు, నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, శ్రీ రాహుల్ గాంధీ గారికి, అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు,నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను'' అంటూ ఆమె ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
గడిచిన కొన్ని వారాలుగా, పగలనకా, రేయనకా, కష్టాల కోర్చి, బాధలను మింగి, సవాళ్లకు ఎదురు నిలిచి, నన్ను నమ్మి, రాజశేఖర బిడ్డగా, మీ గొంతుగా నన్ను ఆదరించి, నా ఈ పోరాటంలో నాతో కలిసి నడిచిన కాంగ్రెస్ కార్యకర్తలు,నేతలు,ఈ ఎన్నికల మహాయజ్ఞంలో ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన ఓటరు మహాశయులకు,…
— YS Sharmila (@realyssharmila) May 14, 2024