Viral News: హనీమూన్ అని చెప్పి అయోధ్యకు తీసుకెళ్లాడు..నాకు విడాకులు కావాలి! హనీమూన్ కోసం గోవా తీసుకుని వెళ్లమంటే.. కుటుంబం మొత్తాన్నిఅయోధ్యకు తీసుకుని వెళ్లాడని ఓ మహిళ పెళ్లైన 8 నెలలకే తన భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కింది. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది. By Bhavana 26 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Madhya Pradesh: కొత్తగా పెళ్లయిన జంట (Newly Married) హనీమూన్ (HoneyMoon)కోసం గోవాకో (Goa), కొడైకెనాల్ కో..లేదా ఇతర దేశాలకో ప్లాన్లు వేసుకుంటుంటారు. కానీ ఇక్కడ ఓ భర్త తన భార్యను హనీమూన్ అని చెప్పి అయోధ్యకు(Ayodhya) తీసుకుని వచ్చాడు. దీంతో ఆమె విడాకుల (Divorce)కోసం కోర్టు మెట్లు ఎక్కింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గోవా అని చెప్పి అయోధ్యకు.. అసలేం జరిగిందంటే..మధ్యప్రదేశ్‌లోని ఓ యువతి తమ వివాహం జరిగిన ఎనిమిది నెలలకే భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కింది. దానికి కారణం ఏంటో తెలుసా.. ఆమె భర్త ఆమెను హనీమూన్‌కి గోవాకి తీసుకుని వెళ్లకుండా..అయోధ్యకు తీసుకుని రావడమే. దీంతో ఆమె విడాకుల దరఖాస్తును కుటుంబ న్యాయస్థానంలో సమర్పించింది. ఈ విషయం గురించి తెలుసుకున్న న్యాయమూర్తులు వారిద్దరికీ కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఈ జంటకు పెళ్లై కేవలం 8 నెలలే కావడంతో పాటు వారిద్దరూ ఐటీ నిపుణులుగా పని చేస్తున్నారని మ్యారేజ్ కోర్టు కౌన్సిలర్ షైల్ అవస్తి తెలిపారు. ఆ యువతి తమ విడాకుల పిటిషన్ లో ఈ విధంగా పేర్కొంది. మేము ఇద్దరం బాగానే సంపాదిస్తున్నాం.మాకు విదేశాలకు హనీమూన్ కు వెళ్లడం పెద్ద విషయం కాదు అంటూ పిటిషన్ లో వివరించింది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా, ఆ మహిళ భర్త ఆమెను విదేశాలకు తీసుకెళ్లడానికి నిరాకరించాడు. అంతేకాకుండా భారతదేశంలోనే ఒక స్థలాన్ని సందర్శించాలని పట్టుబట్టాడు. అతను తన తల్లిదండ్రులను చూసుకోవాల్సి ఉందని, ఈ జంట తమ హనీమూన్ కోసం గోవా, దక్షిణ భారతదేశాన్ని సందర్శించడానికి అంగీకరించారని అతను పేర్కొన్నాడు. అయోధ్య, వారణాసికి.. అయితే, ఆ తర్వాత తన భార్యకు చెప్పకుండానే అయోధ్య, వారణాసికి విమానాలు బుక్ చేశాడు. రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి తన తల్లి నగరాన్ని సందర్శించాలని కోరుకోవడంతో వారు అయోధ్యకు వెళుతున్నామని, ప్రయాణానికి ఒక రోజు ముందు మాత్రమే మారిన ప్రయాణ ప్రణాళికలను ఆమెకు తెలియజేశాడు. ఆ సమయంలో ఆమె యాత్రకు అభ్యంతరం చెప్పకపోవడంతో పక్కా ప్రణాళికతో ముందుకు సాగింది. అయితే, వారు తిరిగి వచ్చిన తర్వాత వారు తీవ్ర వాగ్వాదానికి దిగారు. కేసు జనవరి 19న భోపాల్‌లోని ఫ్యామిలీ కోర్టుకు చేరుకుంది.తన భర్త తన కంటే తన కుటుంబ సభ్యులను ఎక్కువగా చూసుకునేవాడని ఆమె తన పిటిషన్ లో పేర్కొంది. తల్లిదండ్రులను చూసుకోవడంలో ముఖ్య పాత్ర వహిస్తుంటే తన భార్య పెద్ద గొడవ చేస్తుందని సదరు యువకుడు చెప్పాడు. ప్రస్తుతం ఈ జంటకు భోపాల్ ఫ్యామిలీ కోర్టులో కౌన్సెలింగ్ జరుగుతోంది. Also read: జాతీయ జెండాను ఎగరవేయడానికి..ఆవిష్కరించడానికి మధ్య వ్యత్యాసం ఏంటో తెలుసా! #ayodhya #madhyapradesh #women #goa #divorce #honeymoon మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి