Telangana : వివాహేతర సంబధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపించిన భార్య

హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేయించింది. అంత్యక్రయల తర్వాత అసలు విషయం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

New Update
Eluru : సబ్‌స్టేషన్‌లో రాసలీలలు.. నగ్నంగా దొరికిపోయిన విద్యుత్ ఉద్యోగి!

Hyderabad Crime : హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి(Extra Marital Affair) అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేయించడం(Wife Killed Husband) కలకలం రేపింది. భర్త గుండెపోటు(Heart Attack) తో మరణించాడని కుటుంబ సభ్యులను నమ్మించింది. అంత్యక్రియలు జరిగిన తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భార్య, ప్రియుడుతో సహా నలుగురిపై కేసు నమోదైంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎల్లారెడ్డిగూడ జయప్రకాశ్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో విజయ్‌కుమార్‌, శ్రీలక్ష్మి దంపతులు ఉంటున్నారు. అయితే శ్రీలక్ష్మికి.. రాజేష్ అనే మరో యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. వీళ్లిద్దరూ పెళ్లి కాకముందే ప్రేమించుకున్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా వీళ్లు వివాహేతర సంబంధం కొనసాగించారు. ఈ క్రమంలోనే భర్త విజయ్ కుమార్‌ అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి భార్య శ్రీలక్ష్మి ప్లాన్ వేసింది.

Also read: శ్రవణ్‌ కిడ్నాప్‌ కేసులో ట్విస్ట్‌.. 2 గంటల పాటు సినిమా స్టైల్‌లో హైడ్రామా..!

సనత్‌నగర్‌కు చెందిన రౌడీషీటర్ పటోళ్ల రాజేశ్వర్‌రెడ్డి, మహ్మద్‌ మైతాబ్‌ సుపారీ ఇచ్చింది. ఫిబ్రవరి 1న భర్త బయటకు వెళ్లిన సమయంలో ప్రియుడు రాజేష్‌, రౌడీషీటర్‌ రాజేశ్వర్‌రెడ్డి, మైతాబ్‌లను శ్రీలక్ష్మి ఇంటికి పిలిచింది. భర్త ఇంటికి రాగానే తలుపులు మూసేసింది. దీంతో వాళ్లు డంబెళ్లు, ఇనుపరాడ్లతో విజయ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. ప్లీజ్.. నన్ను చంపొద్దని విజయ్ ఎంత ప్రాధేయపడినా నిందితులు అమానుషంగా హత్య చేశారు. రాజేష్ చనిపోయాడని నిర్ధారించుకున్నాక బాత్‌రూమ్‌లో పడేశారు. ఆ తర్వాత తన భర్త గుండెపోటుతో మరణించాడని భార్య శ్రీలక్ష్మి అందరిని నమ్మించింది. నిజమేనని నమ్మిన రాజేష్ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేశారు. అయితే చంపొద్దని వేడుకోవడం పదేపదే గుర్తుకురావడంతో నిందితుడు రాజేశ్వర్‌ రెడ్డి పశ్చాత్తాపం చెందాడు. చివరికి పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. దీంతో పోలీసులు నలుగురిపై హత్య కేసు నమోదు చేశారు.

Also Read: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం… బీఆర్ఎస్ లోకి విజయశాంతి?

Advertisment
Advertisment
తాజా కథనాలు