/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-24T144516.395.jpg)
Singapore: సింగపూర్‌లో వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి క్యాసినో ఆడి ఏకంగా 4 మిలియన్ డాలర్లు (రూ. 33 కోట్లు) గెలుచుకున్నాడు. అంతమొత్తంలో డబ్బు గెలుచుకున్నాననే ఆనందం తట్టుకోలేక.. ఒక్కసారిగా గుండెపోటుతో (Cardiac Arrest) అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడున్న వాళ్లు అతడిని చూడగా.. అక్కడే చనిపోయినట్లు గుర్తించారు. మెరినా బే సాండ్స్ క్యాసినోలో (Marina Bay Casino) ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read: నాసా నుంచి పిక్చర్ ఆఫ్ ది డే! ఇది మామూలుగా లేదు.. రివర్స్ లో వెళుతున్న మెరుపులు ఇవి!
ఈ మెరినా బే సాండ్స్ క్యాసినోలో నాలుగు స్థాయిల గేమింగ్ స్పేస్ ఫ్లోర్లు ఉన్నాయి. 2300 లకు పైగా స్లాట్ మెషిన్స్ ఉన్నాయి. ఇందులో కొత్తవి, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాధారణ పొందిన ఎలక్ట్రానిక్ గేమింగ్ మిషెన్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చే కస్టమర్లు వాళ్లకు నచ్చిన వాటిలో క్యాసినో ఆడుకోవచ్చు. అలాగే 250కి పైగా గెమ్ టైటిల్స్, 500 గేమింగ్ టేబుల్స్, 30కి పైగా ప్రైవేట్ గేమింగ్ రూమ్స్ ఉన్నాయి.
Also Read: నాసా నుంచి పిక్చర్ ఆఫ్ ది డే! ఇది మామూలుగా లేదు.. రివర్స్ లో వెళుతున్న మెరుపులు ఇవి!