CRIME:భర్తను పాముతో కాటువేయించి చంపిన భార్య

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా తన భర్తను తానే చంపించి తర్వాత గుండెపోటని చిత్రీకరించడానికి ప్రయత్నించిందో మహిళ. డబ్బులిచ్చి, పాముతె కాటు వేయించి మరీ భర్తను చంపించింది.

New Update
CRIME:భర్తను పాముతో కాటువేయించి చంపిన భార్య

రాను రాను మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. సుఖాల మోజులో పడి కట్టుకున్న వారిని పట్టించుకోవడం లేదు. దాంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. అక్కడ మార్కేండయ కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రవీణ్ ను భార్యే డబ్బులిచ్చి మరీ చంపించింది. ముందు దిండుతో ఊపిరాడకుండా చేసి తర్వాత పాముతో కాటు వేయించి మరీ చంపింది. ఆ తర్వాత గుండె పోటని నమ్మించడానికి ప్రయత్నించింది. కానీ మృతుడి తల్లికి అనుమానం వచ్చి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.

కొచ్చెర ప్రవీణ్‌ మార్కండేయ కాలనీకి చెందిన రియల్‌ ఎస్టేట్ వ్యాపారి. కొన్నాళ్లుగా ప్రవీణ్‌ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వివాహేతర బంధంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవ పడుతూ ఉండేవారు. చివరకు విసిగిపోయిన భార్య లలిత భర్త ప్రవీణ్‌ను చంపాలని డిసైడ్ అయింది. భర్త దగ్గర పనిచేసే హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన..మచ్చ సురేష్‌తో కలిసి హత్యకు ప్లాన్ చేసింది.భర్తను చంపితే ఒక ప్లాట్‌ ఇస్తానని ఆఫర్ ఇచ్చింది. దీంతో ప్రవీణ్‌ను చంపేందుకు
స్నేహితులతో కలిసి సురేష్‌ స్కెచ్ వేశాడు. రామగుండానికి చెందిన ఇందారపు సతీష్‌, మందమర్రికి చెందిన మాస శ్రీనివాస్‌, భీమ గణేశ్‌, చంద్రశేఖర్‌లు కలిసి ప్రవీణ్ను హత్య చేశారు.

Also Read:భారత్-పాక్ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న హైదరాబాద్

ఈనెల 9న రాత్రి రామగుండంలో మద్యం తాగిన నిందితులు తర్వాత ప్రవీణ్ ఇంటికి చేరుకున్నారు. ప్రవీణ్‌ ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి దాని తర్వాత పాముతో కాటు వేయించి అక్కడి నుంచి పరారయ్యారు. భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న లలిత గుండెపోటుతో చనిపోయాడంటూ డ్రామా ఆడింది. కానీ అనుమానం వచ్చి ప్రవీణ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. మిస్టరీని ఛేదించిన పోలీసులు లలిత, సురేష్ తో పాటూ నిందితులందరినీ పట్టుకున్నారు. ప్రవీణ్‌, లలిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime : అన్నంలో మత్తు మందు కలిపి... వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ

హైదరాబాద్ కాచిగూడలో భారీ దోపిడీ జరిగింది. వృద్ధ దంపతులకు భోజనంలో మత్తుమందు కలిపి దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ.3కోట్ల నగదు, ఖరీదైన కారు ఎత్తుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఇంట్లో పని మనుషులే ఈ దోపిడీకి పాల్పడ్డారు.

New Update
Massive theft

Massive theft

 TG Crime :  హైదరాబాద్ కాచిగూడలో భారీ దోపిడీ జరిగింది. వృద్ధ దంపతులకు భోజనంలో మత్తుమందు కలిపి దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ.3కోట్ల నగదు, ఖరీదైన కారు ఎత్తుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. కాచిగూడ లింగంపల్లి అమ్మవారి దేవాలయం సమీపంలో ప్రముఖ పారిశ్రామికవేత్త హేమ్‌రాజ్‌ , అతడి భార్య మీనా దుగ్గర్‌ నివాసముంటున్నారు. ఇంట్లో పని మనుషులు వ్యాపారవేత్త హేమరాజు దంపతులకు రాత్రి భోజనంలో మత్తుమందు కలిపి పెట్టారు. అది తిన్న దంపతులిద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో వారు నగలు, నగదు తీసుకుని పారిపోయారు.

ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్‌!

కొద్ది రోజుల క్రితం వారు నేపాల్‌కు చెందిన దంపతులను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇటీవల వారి కొడుకు, కోడలు విదేశీ యాత్రకు వెళ్లడంతో హేమ్‌రాజ్, అతడి భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇదే అదనుగా భావించిన పనివారు ఆదివారం రాత్రి భోజనంలో మత్తు మందు కలిపారు. వారు మత్తులోకి వెళ్లగానే ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదుతో పాటు కారు తీసుకుని ఉడాయించారు. ప్రతి రోజూ వాకింగ్‌కు వెళ్లే  హేమరాజ్‌ సోమవారం వాకింగ్‌కు రాకపోవడంతో అతని స్నేహితుడు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. 

Also read: Murder case: కొడుకు అక్రమ సంబంధానికి బలైన తండ్రి.. వాడి పెళ్లం ఫొటోలు వాట్సాప్ స్టేటస్‌

దీంతో అనుమానం వచ్చిన అతని స్నేహితుడు ఇంటికి వచ్చాడు. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న హేమరాజు దంపతులను అతను ఆసుపత్రిలో చేర్పించారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటి నుంచి బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లిన పని మనుషులు (నేపాలి దంపతులు) కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Also read: wife harassment: మరో భార్యా బాధితుడు బలి.. ‘నా అస్తికలను డ్రైనేజీలో కలపండి’

Advertisment
Advertisment
Advertisment