Mayank : 155.5KM.. టీమిండియా స్పీడ్‌ సెన్సేషన్.. ఎవరీ మయాంక యాదవ్?

4 ఓవర్లు.. 27 పరుగులు.. 3 వికెట్లు.. పంజాబ్‌పై గెలుపులో లక్నో బౌలర్‌ మయాంక్‌ యాదవ్‌దే కీ రోల్. గంటకు 150కి.మీకు పైగా వేగంతో బంతులు వేసిన మయాంక్‌ పంజాబ్‌ ప్రధాన వికెట్లు కూల్చాడు. ఇంతకి ఎవరీ మయాంక్‌? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Mayank : 155.5KM.. టీమిండియా స్పీడ్‌ సెన్సేషన్.. ఎవరీ మయాంక యాదవ్?

Who Is IPL Speed Sensation Mayank Yadav? : ఐపీఎల్‌(IPL) ప్రతీ ఏడాది కత్తిలాంటి కుర్రాళ్లను వెలుగులోకి తీసుకొస్తుంటుంది. అప్పటివరకు దేశవాళి మ్యాచ్‌లో అదరగొట్టినా రాని ఫేమ్‌ ఐపీఎల్ ద్వారా యువ క్రికెటర్లకు దక్కుతుంది. ఇక ఆ తర్వాత టాలెంట్‌ని గ్రూమ్‌ చేసుకుంటూ వడివడిగా టీమిండియా(Team India) లోకి ఎంట్రీ ఇచ్చేస్తారు ఈ యంగ్‌ గన్లు. ఈ ఏడాది కూడా మరో చాకు లాంటి కుర్రాడు ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాడు. అయితే గతానికి భిన్నంగా ఈ సారి ఓ బౌలర్‌ ఫ్యాన్స్‌ మనసు దోచుకుంటున్నాడు. గతంలో ఇలా ఓ బౌలర్‌ ఫ్యాన్‌ను కట్టిపడేయడం బుమ్రా డెబ్యూ టైమ్‌లో జరిగింది. మధ్యలో ఉమ్రాన్‌ మాలిక్‌ లాంటి వారు అప్పుడప్పుడు మెరుపులు మెరిపించినా వారి కెరీర్‌ మాత్రం పెద్దగా టర్న్ తీసుకోలేదు. ఇక తాజాగా పంజాబ్‌ వర్సెస్‌ లక్నో(Punjab v/s Lucknow) మ్యాచ్‌లో 21 ఏళ్ల మయాంక్ యాదవ్‌(Mayank Yadav) బంతితో నిప్పులు చెరగడం అందరి దృష్టిని ఆకర్షించింది.


తొలి బంతి నుంచే మొదలు:
లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎల్‌ఎస్‌జీ 199 పరుగులు చేసింది. ఈ స్కోరును ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టుకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభానిచ్చారు. ఒక సమయంలో 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 88 పరుగులు చేసింది పంజాబ్‌. ఆ సమయంలో PBKS లక్ష్యాన్ని సులువుగా ఛేదించగలదని అనిపించింది. అయితే 21 ఏళ్ల మయాంక్ యాదవ్‌ ఎంట్రీత సీన్‌ మారిపోయింది. ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఈ యువ ఫాస్ట్ బౌలర్ తొలి ఓవర్‌లోనే తన స్పీడ్‌తో సంచలనం సృష్టించాడు. తన ఐపీఎల్‌ కెరీర్‌లో మొదటి బంతిని 147.1kph వేగంతో బౌల్ చేశాడు. మూడో బంతికి అతను 150kph మార్కును కూడా చేరుకున్నాడు.


నయా రికార్డు:
మయాంక్ యాదవ్ 12వ ఓవర్లో తన పేస్‌తో మళ్లీ విధ్వంసం సృష్టించాడు.155.8 వేగంతో బౌల్ చేశాడు. ఐపీఎల్ 2024లో ఇదే అత్యంత వేగవంతమైన బంతి. ఈ ఓవర్‌లో మయాంక్ 150కిలోమీటర్ల మార్కును మొత్తం మూడుసార్లు అధిగమించడం విశేషం. పంజాబ్ కింగ్స్‌పై మయాంక్ యాదవ్ తన కోటాలో 4 ఓవర్లు వేసి మొత్తం 27 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. లక్నో గెలుపులో మయాంక్‌దే కీలక పాత్ర.

ఎవరీ మయాంక?

21 ఏళ్ల మయాంక్ యాదవ్ ఢిల్లీ(Delhi) తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. దేశవాళీ సర్క్యూట్‌లోనూ ఈ యువ బౌలర్ తన పేస్‌తో విధ్వంసం సృష్టించాడు. మయాంక్‌ ఇప్పటివరకు 10 టీ20, 17 లిస్ట్-A మ్యాచ్‌లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో మొత్తం 46 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్-2022 వేలంలో మయాంక్ యాదవ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ బేస్ ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2023లో గాయం కారణంగా అతను టోర్నీకి దూరమయ్యాడు. వార్మప్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఇక ఈ ఏడాది పంజాబ్‌పై మ్యాచ్‌లో అరంగేట్రం చేసే అవకాశం రావడంతో తన ఫేస్‌తో నిప్పులు చెరిగాడు.

Also Read : మీ లవర్‌తో ఎంజాయ్ చేసేందుకు హైదరాబాద్‌లోని రొమాంటిక్ స్పాట్స్ ఇవే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News Updates: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu

🔴Live News Updates:

TS: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు

తెలంగాణలో నెంబర్ ప్లేట్లు మార్చాల్సిన టైమ్ వచ్చేసింది. పాతదే అయినా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ తప్పనిసరి చేసింది రవాణాశాఖ. సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా నిర్ణయించింది. 

ts
High Security number plate

 

మీ వెహికల్ 2019 ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు తయారైందా...అయితే అర్జంటుగా వెళ్ళి నంబర్ ప్లేట్ మార్చుకోండి.  పై తేదీ కన్నా ముందు తయారైన వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించుకోవాల్సిందేనని తెలంగాణ రవాణాశాఖ చెప్పింది.  దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వాహన రకాన్ని బట్టి నంబర్‌ ప్లేట్‌కు కనిష్ఠంగా రూ.320.. గరిష్ఠంగా రూ.800గా ఛార్జీలను ఖరారు చేసింది. నకిలీ నంబర్‌ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం, దొంగతనాలను అరికట్టడం, వాహనాలు రహదారి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేస్తున్నామని రవాణాశాఖ చెబుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. 

కచ్చితంగా మార్చాల్సిందే..

పాత వాహనాలకు నంబర్ ప్లేట్ మార్చాల్సి బాధ్యత యజమానిదే అని తేల్చి చెప్పింది రవాణాశాఖ. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ మార్చుకోకపోతే వాహనాలను అమ్మాలన్నీ, కొనాలన్నా సాధ్యం కాదని తెలిపింది. అలాగే బీమా, పొల్యూషన్ సర్టిఫికేట్ లాంటివి కూడా లభించవు. పైగా సెప్టెంబర్ తర్వాత కొత్త నంబర్ ప్లేట్లు కనిపించకపోతే కేసులు కూడా నమోదు చేయనున్నారు.  ఇక ఈ నంబర్ ప్లేట్లు వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల దగ్గర కూడా చేయించుకోవచ్చును. దీనికి సంబంధించిన సమాచారం, నంబర్ ప్లేట్ ధరలు డీలర్ దగ్గర కనిపిచేలా చేయనున్నారు. వాహనదారులు ఈ ప్లేట్‌ కోసం www.siam.in వెబ్‌సైట్‌లో ..వాహన వివరాలు నమోదు చేసి బుక్‌ చేసుకోవాలి. కొత్త ప్లేట్‌ బిగించాక ఆ ఫొటోను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

Also Read:  Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

Advertisment
Advertisment
Advertisment