Target KCR: 24 గంటల్లోపే యాక్షన్ ప్లాన్.. టార్గెట్ కేసీఆర్.. శ్వేతపత్రం రిలీజ్ నిర్ణయం వెనుక కారణం ఇదే! 2014 నుంచి డిసెంబర్ 7, 2023 వరకు తెలంగాణ ఫైనాన్స్‌కు సంబంధించి అన్నీ వివరాలతో కూడిన లెక్కలు చెప్పాలని కాంగ్రెస్ మంత్రులు అధికారులను ఆదేశించారు. శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ టార్గెట్‌గానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. By Trinath 07 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి ఒక దెబ్బకు రెండు పిట్టాలో, మూడు పిట్టాలో తెలియదు కానీ.. కాంగ్రెస్(Congress) వేస్తున్న అడుగులు చూస్తుంటే మొత్తం కేసీఆర్ కుటుంబాన్నే కార్నర్ చేసేలా ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే సచివాలయంలో భేటీ అయిన తెలంగాణ మంత్రులు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. మంద్రి శ్రీధర్‌బాబు ప్రెస్‌మీట్ వింటే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. ఈ 9ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై లెక్కలు చెప్పాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది కొత్త మంత్రి వర్గం. సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) నేతృత్వంలో అన్నీశాఖలపై స్థితిగతులపై ఆరా తీస్తోంది. ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారో.. ఎందుకు ఖర్చు చేశారో.. ఇలా ప్రతీదాన్ని లెక్కలతో చెప్పాలని అధికారులను ఆదేశించడం వెనుక కేసీఆర్ ఇరుకున పెట్టడమే లక్ష్యంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శ్వేతపత్రం విడుదల చేస్తాం: బీఆర్‌ఎస్ చేసిన అప్పుల వివరాలను ప్రజలకు తెలిసేలా చేయడమే కాంగ్రెస్ టార్గెట్‌గా కనిపిస్తోంది. 2014 నుంచి డిసెంబర్ 7, 2023 వరకు తెలంగాణ ఫైనెన్స్‌కు సంబంధించి, అన్నీ డిపార్టెమెంట్లకు సంబంధించి ఖర్చు ఎంత పెట్టారు, దేని గురించి ఖర్చు చేశారు, వాటి ప్రయోజనాలు ప్రజలకు ఎంతవరకు చేరుకున్నాయి లాంటి వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు శ్రీధర్‌బాబు(Sridhar Babu) కుండబద్దలు కొట్టారు. రాష్ట్ర ఫైనెన్స్‌పై తెలంగాణ ప్రజలందరికి తెలిసేలా, వివరాలతో కూడిన అన్నీ అంశాలు తెలియజేయాలని అధికారులను కోరామని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. మొత్తం ఇన్ఫో కావాలని అడగడంలో అర్థమేంటి? తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత(2014) నుంచి ఇప్పటివరకు అన్నీ శాఖల లెక్కలు అడగడం వెనుక అసలు కారణం ఏంటి? పూసగుచ్చినట్టు ఆర్థికంగా ప్రతీ విషయాన్ని బయటకు తీసి ప్రజలకు శ్వేతపత్రం ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. బీఆర్‌ఎస్ పాలనలో అవకతవకలు జరిగాయని నిరూపించడమే కాంగ్రెస్ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రజలకు మొత్తం డేటా ఇవ్వాలని అందుకే నిర్ణయించుకున్నట్లు సమాచారం. టార్గెట్ కాళేశ్వరం: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన అస్త్రం కాళేశ్వరం. ఈ ప్రాజెక్ట్ పేరిట బీఆర్‌ఎస్ పెద్ద స్కామ్ చేసిందని కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారాల్లో తీవ్ర ఆరోపణలు చేశారు. కాళేశ్వరాన్ని ఏటీఎంలా వాడుకున్నారని విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే అన్నీ ఆరోపణలను నిజం అని నిరూపిస్తామని అనేకసార్లు చెప్పారు. ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 24గంటలు కూడా గడవకముందే ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట అవినీతి జరిగిందంటూ ఏసీబీకి కంప్లైంట్ కూడా అందింది. తప్పుడు అంచనాలతో వేలకోట్లు దారి మళ్లాయని ఏసీబీకి ఫిర్యాదు చేశారు న్యాయవాది రాపోలు భాస్కర్. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, కవిత, మెఘా కృష్ణారెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు పై కేసు నమోదు చేయాలని కోరారు. కేసు నమోదు చేసి విచారణ జరపాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిరూపించగలిగితే అది కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబాన్ని పెద్ద ఎదురుదెబ్బ. ఎందుకంటే 2014 నుంచి 2018 వరకు నీటిపారుదలశాఖ మంత్రిగా హరీశ్‌రావు ఉండగా.. రెండో విడత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కేసీఆరే ఈ బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో ఈ కేసు ముందుకు వెళ్తే కేసీఆర్ కుటుంబానికి ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. అటు మెఘా కృష్ణారెడ్డికి ఉచ్చు బిగుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ఇలా మొత్తం కేసీఆర్ కుటుంబం, ఆయన సంబంధికులను టార్గెట్ చేసేలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది గంటల్లోనే వేట మొదలు పెట్టింది. Also Read:24 గంటల కరెంట్ ఇవ్వడం మా గ్యారెంటీ – శ్రీధర్ బాబు WATCH: #ktr #kcr #revanth-reddy #telangana-politics #harish-rao #white-paper #sridhar-babu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి