Milk: మిల్క్ చక్కని ఆరోగ్యానికి బెస్ట్.. కానీ, ఏ పాలు బెటర్.. తెలుసా?

ప్రస్తుత కాలంలో ఆవు, గేదె పాలే కాకుండా బాదం పాలు, వాల్‌నట్ పాలు, కొబ్బరి పాలు, బియ్యం పాలు, ఇతర పాలు మార్కెట్‌లోకి వచ్చాయి. బరువు తగ్గాలనుకుంటే బాదం పాలు, సోయా మిల్క్, ఓట్ మిల్క్ మీకు సరిగ్గా సరిపోతాయని నిపుణులు చెబుతున్నారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Milk: మిల్క్ చక్కని ఆరోగ్యానికి బెస్ట్.. కానీ, ఏ పాలు బెటర్.. తెలుసా?

Milk: పాలు ఆరోగ్యానికి మంచిదని తిసిలిందే. ప్రస్తుత కాలంలో ఆవు, గేదె పాలే కాకుండా ఇప్పుడు వివిధ రకాల పాలు మార్కెట్‌లోకి వచ్చాయి. ఇందులో బాదం పాలు, వాల్‌నట్ పాలు, కొబ్బరి పాలు, బియ్యం పాలు, ఇతర పాలు ఉన్నాయి. ఇప్పటికీ గ్రామాల్లో పాలు తాగడమే బలంగా భావిస్తారు. ఇప్పుడు కూడా పల్లెటూరి పిల్లలు కడుపునిండా పాలు తాగుతున్నారు. పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. అయితే కొన్ని పట్టణల్లో కొందరూ కల్తీపాలను కూడా తయారు చేసి అమ్ముతున్నారు. పాల విషయంలో మీకు ఏది సరైనది..? మనకు ఎలా తెలుస్తుంది..? అనేది చాలామంది గుర్తించలేరు. ఆ విషయాలపై ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

శరీరానికి ఏ పాలు అవసరం:

  • పాలలో పోషకాలన్నీ ఉంటాయి. శరీరానికి అవసరమైనవి. పాలలో కాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ ఇ, డి, కె, ఎ, మెగ్నీషియం, అయోడిన్, ఫాస్పరస్, రైబోఫ్లేవిన్ వంటి అన్ని పోషకాలు పాలలో ఉంటాయి. గేద పాల గురించి చాలామంది ఎక్కువగా తెలుసు. ఇది జంతువుల నుంచి నేరుగా తీస్తారు. ఆవు పాలు, గేదె పాలు, మేక పాలు వంటివి.

బరువు తగ్గాలనుకుంటే:

  • అయితే.. ఇప్పుడు మార్కెట్లోకి రకరకాల పాలు వచ్చాయి. ఇందులో బాదం పాలు, వాల్‌నట్ పాలు, కొబ్బరి పాలు, బియ్యం పాలు, ఇతర పాలు ఉన్నాయి. అయితే మీకు ఏది సరైనది? మనకు ఎలా తెలుస్తుంది? మీరు బరువు తగ్గాలనుకుంటే బాదం పాలు, సోయా మిల్క్, ఓట్ మిల్క్ మీకు సరిగ్గా సరిపోతాయి. మీకు లాక్టోస్ అసహనం ఉంటే. ఆ సమయంలో బాదం పాలు, సోయా పాలు మీకు సరైనవని నిపుణులు అంటున్నారు. మధుమేహం, ఏదైనా గుండె సంబంధిత వ్యాధి ఉన్న రోగి అయితే.. స్కిమ్డ్ మిల్క్ అంటే తక్కువ కొవ్వు పాలు తాగటం ఉత్తమమని వైద్యులు అంటున్నారు.

ఇదికూడా చదవండి: పంచదార, బెల్లం మధ్య తేడా ఏంటి? ఏది మంచిది?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు