Health News: పారాసెటమాల్ టాబ్లెట్‌ మోతాదు మించి వాడితే ఏమవుతుంది?

పారాసెటమాల్ టాబ్లెట్‌ అధిక వినియోగం వల్ల కాలేయం దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ టాబ్లెట్ ను అధిక మోతాదులో తీసుకుంటే వికారం, వాంతులు తీవ్రమైన తలనొప్పి, చిరాకు, చర్మ దద్దుర్లు, నీలిరంగు పెదవులు, మానసిక గందరగోళం ఉంటాయని చెబుతున్నారు

New Update
Health News:  పారాసెటమాల్ టాబ్లెట్‌ మోతాదు మించి వాడితే ఏమవుతుంది?

Health News: ఇటీవల స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ పారాసెటమాల్ వల్ల కలిగే కాలేయ నష్టంపై అధ్యయనం చేసింది. ఈ టాబ్లెట్‌ వినియోగం వల్ల కాలేయం దెబ్బతింటుందని, మితిమీరిన వినియోగం తీవ్ర పరిస్థితులకు దారితీస్తుందని అంటున్నారు. తలనొప్పి, బాడీ పెయిన్స్‌, తేలికపాటి జ్వరానికి ప్రజలు తరచుగా పారాసెటమాల్ టాబ్లెట్స్‌ వేసుకుంటారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పెయిన్ కిల్లర్ ఇది. అయితే కొద్దిపాటి అజాగ్రత్తతో లాభం కంటే ఎక్కువ నష్టమే ఉంటుందని నిపుణులు అంటున్నారు.

మోతాదు మించితే?

పారాసెటమాల్ అధిక మోతాదులో తీసుకుంటే వికారం, వాంతులు ఉంటాయి. కడుపు కుడి వైపున, పక్కటెముకల కింద నొప్పిగా ఉంటుంది. పరిస్థితి విషమిస్తే కాలేయం కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా మూర్ఛ, తీవ్ర జ్వరం, వణుకు, తీవ్రమైన తలనొప్పి, చిరాకు, తినడం కష్టం, శ్వాస సమస్యలు, చర్మ దద్దుర్లు, నీలిరంగు పెదవులు, మానసిక గందరగోళం ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

publive-image

పారాసెటమాల్ ఎవరు వేసుకోకూడదు?

పారాసెటమాల్ కొంతమందికి ప్రమాదకరం. చాలా కాలంగా మద్యం సేవించే వారి కాలేయం ఇప్పటికే పాడైపోయి ఉంటుంది. అలాంటి వారికి పారాసిటమాల్ ఇస్తే వారి పరిస్థితి విషమంగా మారవచ్చని వైద్యులు అంటున్నారు. అలాగే కాలేయ వ్యాధితో బాధపడేవారు పారాసెటమాల్‌కు దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు. అలెర్జీలు ఉన్నవారు కూడా వేసుకోకూడదు. ఏదైనా చికిత్సకు ముందు వైద్యుడిని సంప్రదించాకే టాబ్లెట్‌ వేసుకోవాలని అంటున్నారు.

publive-image

గర్భధారణ నొప్పికి పారాసెటమాల్ వాడవచ్చా?

సాధారణంగా పారాసెటమాల్ గర్భధారణ నొప్పికి సురక్షితం అని చెబుతుంటారు. కానీ దీనిని వాడేముందు రోగి వైద్య చరిత్రను తెలుసుకోవడం చాలా ముఖ్యం. రోగికి కాలేయ సమస్యలు ఉంటే లేదా పారాసెటమాల్‌కు అలెర్జీ ఉంటే వాడకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు.

publive-image

అధిక మోతాదు మరణానికి కారణమా?

ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారికి పారాసెటమాల్‌ కొత్త ఆయుధంగా మారుతోంది. పారాసెటమాల్ అధిక మోతాదులో తీసుకుంటే అపస్మారక స్థితిలోకి వెళ్తారని వైద్యులు అంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆలస్యం చేయకుండా దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్తే కాపాడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: వేళ్లు విరిచే అలవాటు చెడ్డదా..మంచిదా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

తెలంగాణలో జపాన్‌ పెట్టుబడులు.. రూ.12,062 కోట్లు

ఏడురోజుల పాటు జపాన్‌లో పర్యటించిన సీఎం రేవంత్ బృందం కీలక ఒప్పందాల చేసుకుంది. మొత్తం రూ.12,062 కోట్ల పెట్టుబడులు సాధించింది. దీనిద్వారా తెలంగాణలో యువతకు 30,500 ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

New Update
CM Revanth Team in Japan

CM Revanth Team in Japan


సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రైజింగ్ బృందం జపాన్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ బృందం పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. ఏడు రోజుల పర్యటనలో మొత్తం రూ.12,062 కోట్ల పెట్టుబడులు సాధించింది. దీనిద్వారా తెలంగాణలో యువతకు 30,500 ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్‌ ఫ్యూచర్‌ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ ఏర్పాటుకు జపాన్‌కు చెందిన మారుబెని కంపెనీ ఒప్పందం చేసుకుంది. రూ.1000 కోట్ల ప్రారంభ పెట్టుబడి పెట్టనుంది.

Also Read: ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!

మొత్తంగా రూ.5 వేల కోట్ల పెట్టుబడులకు అంచనా వేసింది. అలాగే NTT డేటా, నెయిసా సంస్థలతో కూడా తెలంగాణ సర్కార్‌ ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీలు మొత్తం రూ.10,500 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్‌ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నాయి. తోషిబా  ట్రాన్స్‌మిషన్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్స్‌ ఇండియా (TTDI)తో సైతం ఒప్పందం కుదిరింది. ఆ కంపెనీ రూ.562 కోట్లతో రుద్రారంలోని విద్యుత్ పరికరాలు, సామగ్రి తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది.   

Also Read: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

ఈ కంపెనీల ద్వారా దాదాపు యువతకు 30,500 ఉద్యోగాలు రానున్నాయి. తెలంగాణ సర్కార్‌ ఆధ్వర్యంలో టామ్ కామ్‌తో టెర్న్, రాజ్‌ గ్రూప్‌లు చేసుకున్న ఒప్పందాలు వల్ల రాష్ట్రానికి చెందిన 500 మందికి జపాన్‌లో ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమమైంది. ఇదిలాఉండగా.. సీఎం రేవంత్ బృందం ఏప్రిల్ 15న జపాన్‌ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 22 వరకు అక్కడ పర్యటించింది. ఈ పర్యటనలో సీఎం రేవంత్ వెంట మంత్రి శ్రీధర్‌ బాబు, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్ తదితరులు ఉన్నారు. 

Also read: పహల్గాం ఉగ్రదాడి..మోడీకి ట్రంప్‌ ఫోన్‌!

 telugu-news | rtv-news | cm revanth | japan 

 

Advertisment
Advertisment
Advertisment