walking: ఏ వయసువారు ఎన్ని గంటలు నడవాలి?..నిపుణులు ఏమంటున్నారు? వ్యాయామాల కంటే ప్రతి రోజూ నడిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఒక వ్యక్తి తన వయస్సును బట్టి నడిస్తే బరువును అదుపులో ఉంచుతుందని అధ్యయన పరిశోధకులు అంటున్నారు. ఏ వయసు వారు ఎంత సమయం నడవాలో తెలియాలంటే ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. By Vijaya Nimma 29 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి walking: చాలా మంది ఆరోగ్యంగా ఉండేందుకు జిమ్‌కి వెళ్లడం లేదా యోగా చేయడం చేస్తుంటారు. కానీ చాలా మంది వాకింగ్ చేయడానికే మొగ్గు చూపుతుంటారు. ఆరోగ్య నిపుణులు కూడా వ్యాయామాల కంటే ప్రతి రోజూ నడిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. అయితే ఏ వయసు ఉన్నవారు రోజుకు ఎన్ని గంటలు నడవాలో చాలా మందికి తెలియదు. నడక గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. వయను బట్టి నడవాలి: స్వీడన్‌లోని కోల్‌మార్ విశ్వవిద్యాలయంలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం ఒక వ్యక్తి తన వయస్సును బట్టి నడవాలి. ఎందుకంటే ఇది బరువును అదుపులో ఉంచుతుంది. అదే సమయంలో వ్యాధుల ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందని తేలింది. అంతేకాకుండా మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ‌్బులు కూడా తగ్గుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. 6 నుంచి 17 సంవత్సరాలు ఉన్నవారు: పరిశోధన ప్రకారం 6-17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఎక్కువగా నడవాలని చెబుతున్నారు. ఈ వయస్సు ఉన్నవారు రోజుకు కనీసం 15 వేల అడుగులు నడవాలని, అమ్మాయిలు అయితే 12 వేల అడుగులు నడవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 18 నుంచి 40 సంవత్సరాలు ఉన్నవారు: ఈ వయస్సులో ఉన్న స్త్రీ, పురుషులు కనీసం ఒక రోజులో 12 వేల అడుగులు నడవాలని వైద్యులు అంటున్నారు. 40 ఏళ్ల తర్వాత ఆరోగ్య సంబంధిత సమస్యలు మొదలవుతాయి కాబట్టి ఈ వయస్సు ఉన్నవారు రోజుకు 11 వేల అడుగులు నడవాలి. 50 ఏళ్లు పైబడినవారు: 50 ఏళ్లు పైబడిన వారు రోజుకు 10 వేల అడుగులు నడవాలి. 60 ఏళ్లు పైబడిన వారు రోజుకు కనీసం 8 వేల అడుగులు నడవాలని వైద్యులు అంటున్నారు. అయితే నడిచేప్పుడు అలసటగా ఉంటే మాత్రం కాసేపు అలాగే కూర్చోవాలని అంటున్నారు. ఇది కూడా చదవండి: వేప ఆకులతో వందల రోగాలు మాయం.. ఎలా తినాలంటే? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #health-care #walking #best-health-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి