ఏపీకి పొంచి ఉన్న మరో తుపాన్ ముప్పు
డిసెంబర్ 16 న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. అది 18 వ తేదీ నాటికి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. అది శ్రీలంక, తమిళనాడు, ఏపీ వైపు కొనసాగుతోందని చెబుతున్నారు.
డిసెంబర్ 16 న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. అది 18 వ తేదీ నాటికి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. అది శ్రీలంక, తమిళనాడు, ఏపీ వైపు కొనసాగుతోందని చెబుతున్నారు.
ముగ్గురు వ్యక్తులు వాగులో పడి కొట్టుకుపోయిన సంఘటన అల్లూరి జిల్లా అనంతగిరి మండలం భీంపోలు పంచాయతీలో చోటుచేసుకుంది. వాగు ప్రవాహం ఉధృతంగా ఉండటంతో వారిని కాపాడేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఒకరు మృతి చెందగా ఇద్దరి జాడ కోసం అధికారులు గాలిస్తున్నారు.
తెలంగాణ పై ఇంకా మిచౌంగ్ ప్రభావం కొనసాగుతుంది. గురువారం కూడా హైదరాబాద్ నగరంలో వర్షం పడే అవకాశాలున్నట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు. ర్షా ప్రభావం వల్ల రాష్ట్రంలో రెండు రోజుల నుంచి చలితీవ్రత బాగా పెరిగింది.
గురువారం మధ్యాహ్నం జనసేన అధినేత విశాఖపట్నానికి రానున్నారు. ఆళ్వార్ దాస్ గ్రౌండ్స్ లో జరిగే సభలో ఏపీలో మిచౌంగ్ సృష్టించిన బీభత్సం గురించి ఆయన ప్రసంగించనున్నారు.
తమిళనాడులోని చెన్నై, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో 12 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. వరదల్లో చిక్కుకొని, భవనాలు కూలిపోయి, చెట్లు విరిగిపడి, వీళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ అక్కడ పలు ప్రాంతాలు వరద నీటిలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్ కారణంగా మరోసారి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో సెలవులు ఇస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఏపీలో మిచౌంగ్ తుఫాన్ తీవ్ర బీభత్సం సృష్టించింది.రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో పంట నష్టం భారీగా జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నష్టం గురించి ప్రభుత్వాధికారులు ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఏపీలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. మిచౌంగ్ తుఫాన్ ప్రభావం కూరగాయల ధరల మీద ప్రభావం చూపుతున్నట్లు రైతులు చెబుతున్నారు.
మిచౌంగ్ తుపాను కారణంగా చెన్నైలో నెలకొన్న పరిస్థితులపై నటుడు విశాల్ స్పందించారు. చెన్నై మేయర్, కార్పొరేషన్ కమిషనర్, అధికారులంతా మీ కుటుంబ సభ్యులతో కలిసి సురక్షితంగా ఉన్నారా? నేను సిగ్గుతో తలదించుకుంటున్నా. కనీసం మీ బాధ్యతనైనా నిర్వర్తించి ప్రజలను కాపాడండి అంటూ చురకలంటిచారు.