మిచౌంగ్ తుఫాన్ బీభత్సం..ఐదుగురి మృతి..స్కూళ్లు మూసివేత!
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. వర్షాల వల్ల చెన్నై నగరంలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. వర్షాల వల్ల చెన్నై నగరంలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
భారీ సైక్లోన్ మిచౌంగ్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. మరో గంట వ్యవధిలో ఇది పూర్తిగా తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తరువాత సాయంత్రానికి బలహీనపడి వాయుగుండంగా మారి భారీ వర్షాలు కురుస్తాయి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో రైతులపై మిచౌంగ్ తుపాను నీళ్లు చల్లింది. ఐ.పోలవరం, తాళ్లరేవు మండలాలలో మిచోంగ్ తుపాన్ బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చేతికి వచ్చిన పంట నీటి పాలైంది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
మిచౌంగ్ తుపాను తెలంగాణపై ప్రభావం చూపనుంది. రేపు మధ్యాహ్నం పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈశాన్య తెలంగాణ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు.
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సీఎం జగన్ జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులకు అండగా నిలవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
ఏపీలో మిచౌంగ్ తుఫాన్ కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వివరించారు. సుమారు 150 రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, బాపట్ల, చీరాల మీదుగా వెళ్లే రైళ్లను రద్దు అయ్యాయి.
తిరుమల పుణ్యక్షేత్రంలో గత వారం రోజులుగా ఎడతెరుపు లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. తిరుమలలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి .రోజంతా వర్షం కురుస్తుండడంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మిచౌంగ్ తుఫాన్ ఏపీవైపు దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో వాయువ్య దిశగా తుఫాను కదులుతోంది.దీని వల్ల ఏపీ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మచిలీపట్నంలో భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి.
మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్ తో కోయంబత్తూరు- చెన్నై మధ్యలో రెండు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా తిరుపతి జిల్లా రేణిగుంటకు వచ్చే ఎయిర్ ఇండియా విమానంతోపాటు పలు రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.