మిచౌంగ్ ఎఫెక్ట్ భారీగా పెరిగిన టమాటా, ఉల్లి ధరలు!
ఏపీలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. మిచౌంగ్ తుఫాన్ ప్రభావం కూరగాయల ధరల మీద ప్రభావం చూపుతున్నట్లు రైతులు చెబుతున్నారు.
ఏపీలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. మిచౌంగ్ తుఫాన్ ప్రభావం కూరగాయల ధరల మీద ప్రభావం చూపుతున్నట్లు రైతులు చెబుతున్నారు.
మిచౌంగ్ తుపాను కారణంగా చెన్నైలో నెలకొన్న పరిస్థితులపై నటుడు విశాల్ స్పందించారు. చెన్నై మేయర్, కార్పొరేషన్ కమిషనర్, అధికారులంతా మీ కుటుంబ సభ్యులతో కలిసి సురక్షితంగా ఉన్నారా? నేను సిగ్గుతో తలదించుకుంటున్నా. కనీసం మీ బాధ్యతనైనా నిర్వర్తించి ప్రజలను కాపాడండి అంటూ చురకలంటిచారు.
ఏపీలో అల్లకల్లోలం సృష్టిస్తున్న మిచౌంగ్ తుఫాన్ బాపట్ల వద్ద తీరాన్ని తాకిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరి కాసేపట్లో తీరం దాటుతుందని అధికారులు వివరించారు. సాయంత్రానికి తుఫాన్ బలహీనపడుతుందని తెలిపారు.
ఏపీలో అల్లకల్లోలం సృష్టిస్తున్న మిచౌంగ్ తుఫాన్ సహాయక చర్యల గురించి ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలను వెంటనే ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
ఏపీ తీరం వెంబడి అల్లకల్లోలం సృష్టిస్తున్న మిచౌంగ్ తుఫాన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బాపట్ల వద్ద తీరం దాటనున్నట్లు విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు.
ఏపీలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సముద్రం ముందుకు చొచ్చుకువచ్చింది. తీరం వెంట అలల తాకిడి ఎక్కువగా ఉంది. మిచౌంగ్ బాపట్ల వద్ద తీరం దాటనున్నట్లు అధికారులు వెల్లడించారు.
మిచౌంగ్ ఎఫెక్ట్ తెలంగాణ మీద చూపిస్తుంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి నగరంతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది.దీంతో పలు జిల్లాలకు వాతావరణశాఖాధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.