Weather Update: తెలంగాణకు బిగ్ అలర్ట్.. వచ్చే నాలుగు రోజులు వర్షాలే వర్షాలే!

బంగాళాఖాతంలో ఏర్పడిన అనుకూల పరిస్థితుల వల్ల రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

New Update
Rains

Rains

రాష్ట్రవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఇప్పుడు కాస్త ఉపశమనం లభిస్తోంది. సాయంత్రం వేళల్లో కురుస్తున్న అకాల వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అయితే ఆకాశంలో క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అనుకూల పరిస్థితుల వల్ల రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ  క్రమంలో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 

ఇది కూడా చూడండి: Disha Mouni: దిశా-మౌనీ లెస్బియన్ రూమర్స్‌ పై మరో ట్విస్ట్… పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారు?

ఇది కూడా చూడండి: Fighter Jets : కేంద్రం సంచలన నిర్ణయం.. ప్రైవేటు సంస్థలకు ఫైటర్ జెట్ల తయారీ ఛాన్స్

Advertisment
తాజా కథనాలు