Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఇక దంచుడే దంచుడు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నేడు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు వాతావరణంలో ఏర్పడిన ద్రోణి కారణంగా ఇరు రాష్ట్రాల్లోని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

New Update
Rains

Rains

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నేడు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు వాతావరణంలో ఏర్పడిన ద్రోణి కారణంగా ఇరు రాష్ట్రాల్లోని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణలో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING : అక్రమాస్తుల కేసు : డిప్యూటీ డైరెక్టర్ నరహరి అరెస్ట్!

ఇది కూడా చూడండి: Lashkar Bonalu Jatara 2026 : లష్కర్ బోనాల జాతర 2026...ఉత్సవాల షెడ్యూల్ విడుదల!

ఇక ఏపీ విషయానికొస్తే.. రాయలసీమ జిల్లాలైన అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు, చిత్తూరుతో పాటు కోస్తాంధ్రలోని గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో, ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో నేడు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.

తీర ప్రాంతాల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు. ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండకూడదని అధికారులు సూచనలు జారీ చేశారు. 

ఇది కూడా చూడండి: Crime News : ముస్సోరీ హనీమూన్‌లో విషాదం... ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద మృతి!

Advertisment
తాజా కథనాలు