/rtv/media/media_files/2024/11/28/l7o3be3KRS6JrsE1RGLS.webp)
Telangana Weather: రెండు రోజుల క్రితం గంటపాటి వర్షంతో చల్లబడిన వాతావరణం మళ్ళీ వేడెక్కింది. రాష్ట్రంలో ఎండలు భగభగ మంటున్నాయి. బయట అడుగుపెట్టాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లటి వార్త చెప్పింది. రాబోయే మూడు, నాలుగు రోజులు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కాగా, ఇప్పటికే రాష్ట్రలో వాతావరణం చల్లబడడం గమనించే ఉంటారు.
Also Read: Vijay- Rashmika: ఒకేచోట విడివిడిగా ఫొటోలు.. ఇంకెన్ని రోజులు కొండన్న ఈ దాగుడు మూతలు!
Also Read: వారానికి 150 నిమిషాలు.. ఇలా చేయండి.. మీ మెదడు కత్తిలా షార్ప్!
ఎల్లో అలెర్ట్
దక్షిణ మధ్య బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా పయనించనున్నది. మరో 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం, బుధవారం, పలు చోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. వర్ష సూచన ఎక్కువగా ఉన్న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జరీ చేసింది.
Also Read: Gachibowli land dispute : కేటీఆర్, కిషన్‌రెడ్డిలకు బిగ్ షాక్.. త్వరలో విచారణకు!
telugu-news | latest-news | latest news telugu | rains | TG Weather Updates
Also Read: This Week Ott Movies: ఈవారం ఓటీటీ, థియేటర్స్ లో ఫుల్ ఎంటర్ టైన్మెంట్.. సినిమాల లిస్ట్ ఇదే?