దూసుకొస్తున్న దానా తుఫాన్.. గంటకు 120 కి.మీ వేగంతో.. బంగాళాఖాతంలో దానా తుఫాన్ తీవ్రంగా బలపడింది. ఈ రోజు అర్థరాత్రి లేదా రేపు ఉదయానికి పూరి-సాగర్ ఐలాండ్ సమీపంలో తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్ తీరం దాటే సమయానికి 120 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. By Kusuma 24 Oct 2024 in వాతావరణం Latest News In Telugu New Update షేర్ చేయండి Cyclone Dana: ఉత్తరాంధ్రలో దానా తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా దానా బలపడింది. దీంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అధికారులు హైఅలర్ట్ చేశారు. అర్థరాత్రికి లేదా రేపు ఉదయం పూరి-సాగర్ ఐలాండ్ దగ్గర తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయానికి 120 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. 🚨🇮🇳KENDRAPADA UNDER CYCLONE THREATCyclone Dana makes landfall, affecting Kendrapada district in Odisha.STAY INFORMED, STAY SAFE!#cycloneodisha | #Kendrapada #Cyclone | #CycloneDana pic.twitter.com/LAFGEDf7bS — Weather monitor (@Weathermonitors) October 24, 2024 ఇది కూడా చూడండి: ఈ ఏడాది చివరి నాటికి మతిపోయే టెక్నాలజీ.. అంబానీ మరో సంచలన ప్రకటన! రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు.. ప్రస్తుతం 15 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దానా తుఫాన్ కదులుతోంది. పారాదీప్‌కు 280 కి.మీ, ధమరకు 310 కి.మీ, సాగర్ ఐలాండ్‌కు 370 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతం అవుతోంది. ఈ తుఫాను ఉత్తర ఒడిశా, దక్షిణ బెంగాల్‌పై తీరాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల సూచిస్తారు. అలాగే ఏపీలోని పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు కూడా అధికారులు జారీ చేశారు. The severe cyclonic storm “DANA” (pronounced as Dana) over central & adjoining northwest Bay of Bengal moved north-northwestwards with a speed of 12 kmph during past 6 hours, and lay centred at 0530 hrs IST of today, the 24th October, over northwest & adjoining central Bay of… pic.twitter.com/fPghki83YT — India Meteorological Department (@Indiametdept) October 24, 2024 ఇది కూడా చూడండి: పెప్సీ, కోకా కోలా నుంచి ఇకపై బడ్జెట్ డ్రింక్స్.. కారణమేంటి? దానా తుఫాన్ ప్రభావం దాదాపుగా 36 గంటలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ తుఫాన్ కారణంగా ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో 21 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. CYCLONE DANA NEARING TO COAST LANDFALL PROCESS TO START IN NEXT 2-3 HOURS. CRUCIAL HOURS AHEAD FOR COASTAL ODISHA. EXTREME RAINS & GALE FORCE WINDS 120-135kmph LIKELY TONIGHT TO TOMORROW MORNING STAY SAFE 🙏 #CycloneDanaAlert #CycloneDana pic.twitter.com/HAYPy1xy9B — Eastcoast Weatherman (@eastcoastrains) October 24, 2024 ఇది కూడా చూడండి: కొత్తగా పెళ్లయ్యిందా.. ఈ మూడు పాటించాల్సిందే! ఉత్తరాంధ్రలో తుఫాన్ ప్రభావం ఎక్కువగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఉంటుందని, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. కృష్ణపట్నం, వాడరేవు, నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం, కళింగపట్నం పోర్టులకు కూడా రెండో నంబరు హెచ్చరికలు జారీ చేశారు. ఇది కూడా చూడండి: అమరావతికి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. భారీగా నిధులు! #odisha #west-bengal #cyclone #dana-cyclone మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి