గాడిదలకు రంగేసి.. చైనా జూ పార్క్‌లో మోసం.. దగా

చైనాలో జూ పార్కులు మోసం చేస్తున్నాయి. గాడిదలకు నలుపు, తెలుపు రంగులేసి జీబ్రాలా చిత్రికరిస్తున్నారు. ఇలా చేసి జూలకు రద్దీ పెంచుకుంటున్నాయి. దీనిపై అక్కడి ప్రజలు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చైనా జూ పార్కులు ఇలా మోసం చేశాయి.

New Update
china zoo parks

china zoo parks Photograph: (china zoo parks)

డ్రాగన్ కంట్రీలో ప్రజల్ని మోసం చేస్తున్నారు. చైనాలో జూపార్క్‌లకు జనాల్ని రప్పించేందుకు గాడిదలకు నలుపు, తెలుపు రంగులేసి వాటిని జీబ్రాస్‌లా మార్చారు. షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని జిబో సిటీ జూపార్క్‌లో జీబ్రాలు వింతగా కనిపించాయి. అది గమనించిన కొందరి వాటిని పరిశీలించారు. దీంతో అవి జీబ్రాలు కాలు గాడిదలని తేలింది. దీంతో ఈ విషయం చైనా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంకేముందు ఈ జూకి వెళ్లిన వారంతా పోయాం మోసం అనుకున్నారు. జూ అధికారులను నిలదీయగా నిజం ఒప్పుకున్నారు.

పర్యాటకుల రద్దీని పెంచే ప్రయత్నంలో గాడిదలకు జీబ్రాస్‌లా కనిపించేలా నలుపు, తెలుపు రంగులు వేసినట్లు చెప్పారు. ఇలా జంతువులకు రంగులేయడం వల్ల వాటి ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి చైనా జూలో జంతువులకు రంగులేని మోసం చేయడం ఇదే కొత్త కాదు.

Also Read :  Tamilanadu: ఒక్క నిమ్మకాయ అక్షరాలా రూ.6 లక్షలు.. అందులో ఏమంతా స్పెషల్‌ ఉందబ్బా!

గతంలో కూడా జియాంగ్సు ప్రావిన్స్‌లోని తైజౌలో ఉన్న ఒక జూ, పులులను పోలి ఉండేలా రెండు కుక్కలకు బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్స్ వేసి  మాయ చేశారు. కుక్కలకు రంగులేని పాండాలా కూడా చిత్రీకరించారు. వీటంన్నీటిపై అక్కడ జంతుప్రేమికులు మండిపడ్డారు. డబ్బులు సంపాధించడం కోసం జంతువుల ప్రాణాలతో చలగాటమాడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. అయితే జూ యాజమాన్యం స్పందించి.. ఆ కలర్స్‌తో ఎలాంటి అనారోగ్య ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు. కేవలం సరదా కోసమే అలా చేశామని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ నెటిజన్లు చైనా జూ సిబ్బంది, యాజమాన్యంపై ఫైర్ అవుతూనే ఉన్నారు.

Also Read: Prabhas Spirit Casting Call: డార్లింగ్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్.. ఆ సినిమాలో నటించే అవకాశం..!

Advertisment
Advertisment
Advertisment