/rtv/media/media_files/2025/03/19/4Y3nLRQXWlpadJKvojm8.jpg)
Rajasthan Sub Inspector Photograph: (Rajasthan Sub Inspector)
అదృష్టం బాలేకుంటే అరటి పండు తిన్నా పళ్లు ఊడుతుంటాయనే సామేత వినే ఉంటారు. సరిగ్గా అలాంటి సంఘటనే రాజస్థాన్ ఝుంఝునులో చోటుచేసుకుంది. ఓ లేడీ SI చేసిన ఫ్రాడ్ ఆమె లీవ్ లెటర్ బయటపెట్టింది. దీంతో ఆమె ఊచలు లెక్కెట్టాల్సి వచ్చింది. అసలు కథ ఏంటంటే..
మోనికా అనే యువతి 2021లో పోలీస్ ఉద్యోగం కోసం పరీక్ష రాసింది. ఆమెకు 34వ ర్యాంక్ వచ్చింది. మోనికా హిందీలో 200కి 184, జనరల్ నాలెడ్జ్‌లో 200కి 161 మార్కులు సాధించింది. రాత పరీక్షలో అన్ని మార్కులు తెచ్చుకున్న ఆమె.. ఇంటర్వ్యూలో కేవలం 15 మార్కులు మాత్రమే సాధించింది. అయినా సరే జాబ్ కొట్టి పోలీస్ యూనిఫాం వేసి.. లాఠీ పట్టి డ్యూటీ చేస్తూ వచ్చింది. 2024 జూన్ 5 నుంచి జూలై 5 వరకు మోనిక వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టింది. పై అధికారులకు లీవ్ లెట్టర్ రాసి ఇచ్చింది. అది చూసిన పోలీస్ ఆఫీసర్ ఒక్కసారిగా షాక్ అయై షేక్ అయ్యాడు. అందులో అన్నీ స్పెల్లింగ్ మిస్టేక్సే ఉన్నాయి.
Also read: SC classification: తెలంగాణలో సుప్రీం కోర్టు తీర్పును అమలు చేశాం: సీఎం రేవంత్ రెడ్డి
34 वी रैंक से एसआई बनी मोनिका जाट ने 20 लाइन की अर्जी लिखी, इसमें 13 गलतियाँ थी. बड़ी बात पद का नाम निरीक्षक लिखना नहीं आता. अब पकड़ी गई. pic.twitter.com/fdyf7tkYdR
— Mangilal Jani (@Mangilal_bisnoi) March 19, 2025
బేసిక్ ఇంగ్లీష్ పదాలు కూడా ఆమె సరిగా రాయలేక పోయింది. ఐ, ఇన్‌స్పెక్టర్, ప్రొబేషనర్, డాక్యుమెంట్, ఝుంఝును వంటి పదాల్లో స్పెల్లింగ్ తప్పులు చాలా ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన పై అధికారులు ఆమె ట్రాక్ రికార్డ్ పరిశీలించారు. సైలెంట్‌గా ఇన్వె్స్టిగేషన్ ప్రారంభించారు. అప్పుడే అధికారులకు షాకింగ్ విషయాలు తెలిసింది. ఆమె రూ.15 లక్షలు ఇచ్చి SI రాత పరీక్షలో మాల్ ప్రాక్టీస్ చేసిందని తెలిసింది. మోనిక బ్లూటూత్ వాడి పరీక్షలో టీటింగ్ చేసింది. 2021 సెప్టెంబర్ 15న అజ్మీర్ కేంద్రంలో జరిగిన పరీక్ష సమయంలో మోనికా బ్లూటూత్ పరికరాన్ని ఉపయోగించి కాపీ కొట్టిందని SOG దర్యాప్తులో తేలింది. ఈ ఆపరేషన్‌కు సూత్రధారి అయిన పౌరవ్ కలీర్ మోనికాకు సమాధానాలు అందించినందుకు రూ.15 లక్షలు తీసుకున్నట్లు విచారణలో బయటపడ్డింది. సబ్-ఇన్‌స్పెక్టర్ మోనికను స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అదుపులోకి తీసుకుంది.
Also read: Nagpur violence : హింసకు కారణమైన ప్రధాన నిందితుడు అరెస్ట్