koi koi song: కోయ్..కోయ్ సాంగ్‌కు చనిపోయిన మనిషి బతికేసాడు.. మీరే చూడండి!

సోషల్ మీడియాలో ఇప్పుడంతా ‘‘కోయ్ కోయ్ కొడ్నీ కోయ్’’ సాంగ్ ట్రెండింగ్ అవుతోంది. ఈ సాంగ్‌తో కొందరు యువకులు ఓ వీడియో చేశారు. చనిపోయినట్లు యాక్టింగ్ చేసిన వ్యక్తి వద్దకు వెళ్లి ఈ సాంగ్ పాడారు. వెంటనే అతడు లేచి డ్యాన్స్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.

New Update
KOI KOI KODNI KOI

KOI KOI KODNI KOI

సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఎన్నో వింతలు, విశేషాలు, విచిత్రాలు చూస్తున్నాం. ఆశ్చర్యకర విషయాలు, ఊహకందని సంఘటనలు, కడుపుబ్బా నవ్వించే వీడియోలు, ఔరా అనిపించే ఘటనలు ఇలా.. చాలానే తరచూ చక్కర్లు కొడుతున్నాయి. ఇక అదే సోషల్ మీడియా ఎంతో మందికి మంచి లైఫ్ ఇచ్చింది. 

Also Read: తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు బంద్.. మందుబాబులకు బిగ్ షాక్!

సోషల్ మీడియా కారణంగా మరెందరో సెలబ్రిటీలుగా మారారు. దీంతో ప్రతి ఒక్కరు ఇప్పుడు అదే ధ్యాసలో ఉన్నారు. ఓవర్ నైట్‌లో వైరల్ అయిపోదాం అనుకుని రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఏదో ఒకటి క్లిక్ అవ్వకపోతుందా? అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రెండింగ్‌లో ఏది ఉంటే అది ప్రయత్నిస్తు్న్నారు. 

Also read: బాలయ్య హీరోయిన్ కు వేధింపులు.. 27మందిపై కేసు, పోలీసుల అదుపులో వ్యాపార వేత్త

దీంతో ఆ ట్రెండింగ్ టాపిక్‌పై వీడియోలు చేసి బాగా వైరల్ అయిపోతున్నారు. తాజాగా అలాంటి ప్రయోగమే కొందరు యువకులు చేశారు. సోషల్ మీడియాలో ఇప్పుడంతా ఒకటే సాంగ్. అదే.. కోయి.. కోయి కోడిని కోయ్ సాంగ్. ఫోన్ ఓపెన్ చేస్తే చాలు అవే క్లిప్‌లు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కొందరు యువకులు ఆ ట్రెండింగ్ సాంగ్‌ను సెలెక్ట్ చేసుకుని ఒక వీడియో చేశారు. 

Also Read: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి అలర్ట్.. పోలీసుల కీలక సూచనలు!

అందులో ఒక యువకుడు చనిపోయినట్లు యాక్టింగ్ చేశాడు. మిగతా వారంతా అక్కడ కూర్చుని ఏడుస్తున్నారు. దీంతో అటువైపుగా వచ్చిన ఒక యువకుడు.. చనిపోయిన మనిషి బతకాలంటే ఒక మంచి పాట ఉంది అది పాడితే లేస్తాడు అని చెప్తాడు. దీంతో వారంతా ‘‘కోయి కోయి కోడిని కోయ్’’ అంటూ పాడతారు. దెబ్బకి చనిపోయినట్లు యాక్టింగ్ చేసిన వ్యక్తి వెంటనే లేస్తాడు. దీంతో వారంతా డ్యాన్స్ చేస్తారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

Also Read: అలా చేయడం లైంగిక వేధింపుతో సమానం.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Honey Bees Attack: పెళ్లికెళ్తే చచ్చేంతపనైంది.. తేనెటీగల దాడిలో స్పాట్‌లోనే 50 మంది!

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పెళ్లిబృందపై తేనెటీగలు దాడి చేశాయి. డీజే సౌండ్‌తో ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లివారిపై ఒక్కసారిగా దాడికి దిగాయి. ఈ దాడిలో 50 మంది గాయపడ్డారు. దీంతో వెంటనే బాధితులకు కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు.

New Update
Honey Bees Attack

Honey Bees Attack

ఏపీలోని పార్వతీపురంలో దారుణం జరిగింది. పెళ్లి కోసం వెళ్లిన జనాలు.. చావు అంచుల వరకు వెళ్లారు. ఊరు ఊరంతా డీజే పాటలకు డ్యాన్స్ వేస్తున్న సమయంలో తేనెటీగలు ఒక్కసారిగా అటాక్ చేశాయి. దీంతో పదుల సంఖ్యలో పెళ్లి బృందం హాస్పిటల్‌పాలైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పెళ్లిబృందపై తేనెటీగలు దాడి చేశాయి. డీజే సౌండ్‌తో ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లివారిపై ఒక్కసారిగా దాడికి దిగాయి. ఈ తేనెటీగల దాడిలో సుమార్ 50 మంది గాయపడ్డారు. దీంతో వెంటనే బాధితులకు కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు.

వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వెంటనే బాధితుడిని పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఈ తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడిన పెళ్లి వారు.. హాస్పిటల్‌లో నొప్పిని భరించలేక ఏడుస్తూ ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. 

గతంలో చావు దగ్గర సంఘటన

ఏపీలోని అల్లూరి జిల్లాలోని గన్నేరు కొయ్యపాడులో కొప్పుల పల్లాయమ్మ (86) మృతి చెందింది. దీంతో శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అంతిమయాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగానే శవాన్ని పాడెపై ఎక్కించి తీసుకెళ్తుండగా.. అదే సమయంలో బాణాసంచా కాల్చారు. 

దీంతో అందులో కొన్ని టపాకాయలు పక్కనే ఉన్న చెట్టుపై పడ్డాయి. సరిగ్గా అక్కడే తేనెతుట్టు ఉండటంతో దానికి ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా చెల్లా చెదురయ్యాయి. అదే సమయంలో అంతిమయాత్రలో ఉన్న వారిపై ఏకదాటిగా దాడి చేశాయి. దీంతో అంతిమయాత్రలో పాల్గొన్నవారంతా మృతదేహాన్ని రోడ్డుపై వదిలేసి పరుగులు పెట్టారు. 

ఈ ఘటనలో దాదాపు 40 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని గౌరీదేవి పేట PHCకి తరలించి చికిత్స అందించారు. ఇంకొంతమంది భద్రాచలంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఈ తేనెటీగల దాడి అనంతరం బంధువులు అంత్యక్రియలు పూర్తి చేశారు. దీంతో ఈ ఘటనతో చాలా మంది ఉలిక్కి పడ్డారు. చావుకు వెళ్తే చచ్చేంత పనైందిరా బాబు అంటూ పలువురు బందువులు మాట్లాడుకున్నారు. 

Honey Bees Attack | latest-telugu-news | telugu-news | viral-news

Advertisment
Advertisment
Advertisment