Dhoni: ఊది పడేస్తున్నాడుగా.. ధోనీ హుక్కా స్మోకింగ్ వీడియో వైరల్!

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్‌ సారధి ధోనీ హుక్కా స్మోక్ చేస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ధోనీకి హుక్కా స్మోకింగ్‌ ఇష్టమని గతంలో ఆసీస్‌ ఆటగాడు జార్డ్‌ బెయిలీ కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇది పాత వీడియో అని నెటిజన్లు చెబుతున్నారు.

New Update
Dhoni: ఊది పడేస్తున్నాడుగా.. ధోనీ హుక్కా స్మోకింగ్ వీడియో వైరల్!

ఎంఎస్‌ ధోనీ.. కెప్టెన్సీలో కింగ్‌.. స్టింపింగ్‌లో యస్‌.. సిక్సులు కొట్టడంతో జాక్‌..! అయితే ధోనీ గురించి చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. మహేంద్రుడికి హుక్కా తాగడం అంటే ఇష్టమట. ఈ విషయాన్ని సోషల్‌మీడియాలో అతని ఫ్యాన్స్ చెబుతున్నారు. ధోనీ హుక్కా స్మోక్‌ చేస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియో వైరల్‌:
ఓ ఈవెంట్‌లో ఎంఎస్ ధోనీ(MS Dhoni) హుక్కా తాగుతున్న వీడియో అభిమానుల కంటపడింది. రిషబ్ పంత్, బాలీవుడ్ నటి కృతి సనన్ లాంటి వారితో కలిసి ఇటీవలే దుబాయ్‌(Dubai)లో దర్శనమిచ్చాడు ధోని. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ కోసమే వారు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలోనే ధోనీ హుక్కా తాగుతూ కెమెరాకు చిక్కినట్టు ఫ్యాన్స్ చెబుతున్నారు. రిటైర్ అయినా ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంలో నిబద్ధతతో ఉన్నాడు ధోని. ఎందుకంటే ఐపీఎల్ ఆడుతున్నాడు. ఇక ఈ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో పాటు పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియో వైరల్ అయినప్పటికీ, దాని ప్రామాణికతను లేదా దాని ఖచ్చితమైన తేదీ, సమయాన్ని ధృవీకరించలేని పరిస్థితి. ఇది చాలా కాలం క్రితం ఒక ప్రైవేట్ పార్టీలోని వీడియో అని పలువురు చెబుతున్నారు.

ధోనీకి హుక్కా తాగడం ఇష్టం?
ధోనీ హుక్కా తాగుతున్న వీడియో వైరల్ కావడంతో సీఎస్కే మాజీ సహచరుడు జార్జ్ బెయిలీ చేసిన పాత కామెంట్ మళ్లీ తెరపైకి వచ్చింది. ధోనీ హుక్కా తాగడాన్ని ఇష్టపడతాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గతంలో వ్యాఖ్యానించాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో ధోనీ మరోసారి ఫ్యాన్స్‌ను అలరించనున్నాడు. నిజానికి గత(2023) సీజన్‌తోనే ధోనీ తన ఐపీఎల్‌ కెరీర్‌కు ముగింపు పలుకుతాడని ఫ్యాన్స్‌ భావించారు. పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ధోనీ కూడా పరోక్షంగా ఇదే తన లాస్ట్‌ సీజన్‌ అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ధోనీ సారధ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ 2023 సీజన్‌ విజేతగా నిలిచింది. ఐదోసారి ట్రోఫిని ముద్దాడిన రెండో జట్టుగా నిలిచింది. ఇక ఈ ఏడాది సీజన్‌ కోసం జరిగిన మినీ వేలంలో రచిన్ రవీంద్ర లాంటి ఆటగాళ్లను తీసుకుంది. త్వరలోనే ధోనీ ప్రాక్టీస్‌ మొదలుపెట్టనున్నాడు.

Also Read: ట్రంప్‌గారి నిర్వాకం.. 17వేల మంది బలి..! ఆ మెడిసిన్‌ సంజీవని కాదు.. మృత్యువుకు దారి..!
WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bhubharathi Portal : రేపే భూభారతి పోర్టల్ ఆరంభం..ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు

రేపటి నుంచి భూభారతి పోర్టల్ అందుబాటులోకి రానుంది. తొలుత ఎంపిక చేసిన మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూభారతి అమలుపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఆయన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

New Update
Bhubharathi Portal

Bhubharathi Portal

Bhubharathi Portal : రేపటి నుంచి భూభారతి పోర్టల్ అందుబాటులోకి రానుంది.రాష్ట్రంలో భూభారతి పోర్టల్‌ను తొలుత ఎంపిక చేసిన మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.భూభారతి అమలుపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూభారతి పోర్టల్‌ను రేపు జాతికి అంకితం చేయబోతున్నట్లు తెలిపారు. సామాన్య రైతుకు కూడా అర్ధమయ్యేలా భూభారతిని రూపొందించాలని అధికారులకు సూచించారు. భూభారతి తాత్కాలికం కాదని.. కనీసం వంద సంవత్సరాల పాటు ఉంటుందని అన్నారు. భూభారతి వెబ్‌సైట్ సైతం అత్యాధునికంగా ఉండాలని తెలిపారు. భద్రతాపరమైన సమస్యలు రాకుండా పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు. భూభారతి నిర్వహణ విశ్వసనీయత సంస్థకు అప్పగించాలని చెప్పారు.కాగా పోర్టల్‌పై రైతులకు అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనున్నారు.  

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!

భూ స‌మ‌స్యల ప‌రిష్కారం, లావాదేవీల‌కు చెందిన స‌మాచారం రైతులకు, ప్రజలకు సుల‌భంగా అంద‌బాటులో ఉండేలా భూ భార‌తి పోర్టల్ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. భూభారతికి చెందిన పలు అంశాలను అధికారులకు ఆయన సూచించారు. ఈ పోర్టల్​ ను పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో మూడు మండలాల్లో పైలట్​ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకొని అక్కడ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు భూభారతిపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఆయా స‌ద‌స్సుల్లో ప్రజ‌ల నుంచి వ‌చ్చే సందేహాలను నివృత్తి చేయాలో అధికారులకు సూచించారు. అదేవిధంగా ఈ భూ భారతిపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని ప్రతి మండ‌లంలోనూ క‌లెక్టర్ల ఆధ్వర్యంలో స‌ద‌స్సులు నిర్వహించాల‌ని సీఎం ఆదేశించారు.

Also Read: Earthquake: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?

 ప్రజలు, రైతుల‌కు అర్ధమ‌య్యేలా, సుల‌భ‌మైన భాష‌లో పోర్టల్ ఉండాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోర్టల్ బ‌లోపేతానికి ప్రజ‌ల నుంచి వ‌చ్చే స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రిస్తూ ఎప్పటిక‌ప్పుడు అప్‌డేట్ చేయాలని సీఎం అధికారుల‌కు సూచించారు. వెబ్ సైట్‌తో పాటు యాప్‌ను పటిష్టంగా నిర్వహించాల‌ని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శులు వి.శేషాద్రి, చంద్రశేఖర్‌రెడ్డి, సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ‌, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, రెవెన్యూ కార్యద‌ర్శి జ్యోతి బుద్ద ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

 Also Read: Sridhar Babu : హెచ్ సీయూ భూములు ప్రభుత్వానివే...మంత్రి శ్రీధర్ బాబు సంచలన  

 రాష్ట్రంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్​ ప్రజల పాలిట శాపంగా మారిందని, భూ లావాదేవీలన్నింటినీ ఆన్​లైన్​ ద్వారా నిర్వహించేందుకు తీసుకొచ్చిన ధరణి పోర్టల్​ సామాన్య ప్రజలకు ఇబ్బందులను తెచ్చిందని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్​ పార్టీ గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం విమర్శలు చేసింది. భూముల వివరాలను రెవెన్యూ రికార్డుల నుంచి ధరణి పోర్టల్‌లో ఎక్కించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తింది. దీంతో 20 లక్షలకు పైగా రైతులు ధరణి పోర్టల్‌ కారణంగా ఆగమయ్యారని ఆరోపించింది.

Also Read: Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు.. 110 మంది అరెస్టు

 

Advertisment
Advertisment
Advertisment