Paris Olympics: చరిత్ర సృష్టించిన వినేశ్ ఫోగట్..ఫైనల్స్‌లోకి ఎంటర్

పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ ఫోగట్‌కు మెడల్ ఖాయం అయింది. సెమీ ఫైనల్స్‌లో క్యూబా ప్లేయర్ మీద గెలిచి వినేశ్ ఫైనల్స్‌లోకి ఎంటర్‌‌ అయింది. ఇందులో గెలిస్తే స్వర్ణం వస్తుంది. ఓడిపోయినా సిల్వర్ మెడల్ కచ్చితంగా వస్తుంది.

New Update
Paris Olympics: చరిత్ర సృష్టించిన వినేశ్ ఫోగట్..ఫైనల్స్‌లోకి ఎంటర్

Vinesh Phogat: రెజ్లింగ్‌లో భారత్‌కు మరో పతకం ఖాయం అయింది. అందరి అంచనాలను నిజం చేస్తూ 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో వినేశ్ ఫోగట్ ఫైనల్స్‌కు దూసుకెళ్ళింది. ఈరోజ జరిగిన సెమీ ఫైనల్స్ పోటీలో క్యూబా క్రీడాకారిణి గజ్‌మ్యాన్ లోపేజ్ మీద 5–0 తేడాతో వినేశ్ విజయం ఆధించింది. దీని ద్వారా మొట్టమొదటిసారి రెజ్లింగ్‌లో ఫైనల్స్‌కు చేరిన క్రీడాకారిణిగా వినేశ్ చరిత్ర సృష్టించింది. బుధవారం ఫైనల్‌ జరగనుంది. ఈ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ విభాగంలో కూడా ఇదే తొలి పతకం కానుంది.

Also Read:Telangana: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు