వారికి నా క్షమాపణలు..అలా జరిగి ఉండకూడదు: నాని! హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మధ్యలో విజయ్ దేవరకొండ, రష్మిక ల మార్ఫింగ్ ఫోటో కనిపించింది. ఈ విషయం గురించి ఇద్దరు హీరోల అభిమానుల మధ్య పెద్ద మాటల యుద్దమే జరిగింది. దీంతో నాని ఈ విషయం గురించి క్షమాపణలు చెప్పాడు. By Bhavana 03 Dec 2023 in సినిమా వైరల్ New Update షేర్ చేయండి నేచురల్ స్టార్ నాని ఓ వివాదంలో చిక్కుకున్నారు. దానికి సంబంధించి ఆయనని కొందరు నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. అందులో ఆయనకి ఏం సంబంధం లేకపోయినప్పటికీ కూడా పాపం నాని ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు. అసలేం జరిగిందంటే నాని తాజాగా నటించిన చిత్రం హాయ్ నాన్న. ఈ సినిమా డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్బంగా చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్‌కార్యక్రమం నిర్వహించగా..ఆ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, రష్మిక ల మార్ఫింగ్ ఫోటో ఒకటి స్టేజ్ మీద ప్రత్యక్షం అయ్యింది. దానిని చూసి అక్కడి వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే యాంకర్ సుమ దానిని కవర్ చేయడానికి ప్రయత్నించింది. కానీ విజయ్ ఫ్యాన్స్ మాత్రం నానిని సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో దీని గురించి నాని స్పందించాడు. ''ఇది అసలు తెలియకుండా జరిగింది. సడెన్ గా అలా చూసేసరికి ఎలా రియాక్ట్ కావాలో మాకు తెలియలేదు. ఓ కార్యక్రమం జరుగుతుంది అంటే దాని కోసం ఎంతో మంది పని చేస్తుంటారు. ఈ పనిలో వారిలో ఎవరు చేశారు, ఎందుకు చేశారో అనే విషయం తెలియడం లేదు. విజయ్ రష్మిక ఇద్దరూ కూడా నా స్నేహితులు వారి గురించి ఇలా ఎందుకు చేస్తాం. ఈ ఘటన గురించి ఎవరైనా బాధపడి ఉంటే వారకి నా క్షమాపణలు చెబుతున్నాను. అసలు ఇది జరిగి ఉండకూడదు. ఈవెంట్ లో ఎవరు చేశారో తెలియదు. ఇప్పుడు ఆ వ్యక్తి ఉద్యోగం పోతుందని భయపడుతూ ఉండొచ్చు’’ అని చెప్పుకొచ్చాడు. Also read: స్పీకర్, డిప్యూటీ స్పీకర్ విజయం, దేవరకొండలో కాంగ్రెస్ అభ్యర్థి బాలు నాయక్ #viral #rashmika #cinema #nani #hai-nanna #vijaydevarakonda మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి