Stock Market: హమ్మయ్య గట్టెక్కింది..లాభాల్లో స్టాక్ మార్కెట్ వారం రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు దేశీయ మార్కెట్ సూచీలు ఎట్టకేలకు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 584 పాయింట్ల లాభంతో 81,634 దగ్గర క్లోజ్ అవ్వగా.. నిఫ్టీ కూడా 217 పాయింట్లు లాభపడి 25,013 దగ్గర ముగిసింది. By Manogna alamuru 08 Oct 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Stock Market: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, క్రూడాయిల్ ధరలు, చైనా ఉద్దీపన చర్యల వంటి పరిణామాలతో ఆరు రోజులుగా నష్టాల్లో కూరుకుపోయిన దేశీ మార్కెట్ ఈరోజు కాస్త తెరిపిన పడింది. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ కొద్ది సమయంలోనే పుంజుకుని లాభాలబాట పట్టింది. ఇంట్రాడేలో 81,763.28 పాయింట్ల దగ్గర గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 584.81 పాయింట్ల లాభంతో 81,634.81 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 217.40 పాయింట్ల లాభంతో 25,013.15 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.96గా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ వంటి ప్రధాన స్టాక్స్‌లో బాగా జరిగిన కొనుగోళ్ళు మార్కెట్ లాభాలకు దారి తీసింది. ఇదే సమయంలో బీఎస్ఈ స్మాల్ క్యాప్ 1,322 పాయింట్లు పెరిగి 55,439 దగ్గర ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 19 పెరగ్గా, 11 క్షీణించాయి. 50 నిఫ్టీ స్టాక్స్‌లో 36 పెరగ్గా.. 14 క్షీణించాయి. మీడియా రంగం అత్యధికంగా 3.11% పెరిగింది. అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభపడగా.. టాటా స్టీల్, టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోయాయి. ఇక ఆసియా మార్కెట్‌లో జపాన్‌కు చెందిన నిక్కీ 1.00% పడిపోయింది. హాంకాంగ్‌కు చెందిన హ్యాంగ్‌సెంగ్ సూచీ 9.41% దిగువన ముగియగా, చైనా షాంఘై కాంపోజిట్ 4.59% లాభంతో ముగిసింది. మరోవైపు NSE డేటా ప్రకారం, విదేశీ పెట్టుబడిదారులు (FIIలు) అక్టోబర్ 7న ₹8,293.41 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ కాలంలో, దేశీయ పెట్టుబడిదారులు (DIIలు) ₹ 13,245.12 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. Also Read: Israel: ఇజ్రాయెల్ ఉగ్రరూపం..హెజ్బుల్లా సర్వనాశనం దిశగా దాడులు #stock-market #stock-market-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి