Rats: అయ్యో బాబోయ్.. రైలు కిచెన్‌లోకి దూరిన ఎలుకలు.. స్పందించిన ఐఆర్‌సీటీసీ ఓ రైలులో వంటగదిలోని ఎలుకలు స్వైర విహారం చేయడం కలకలం రేపింది. టెండుల్కర్ అనే వ్యక్తి ఇటీవలె తన కుటుంబంతో కలిసి మడగావ్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణం చేశాడు. వంటగది వైపుగా కొన్ని ఎలుకలు వెళ్లడాన్ని అతడు గమనించాడు. అక్కడున్న ఆహార పాత్రలపై రెండు ఎలుకలు తిరగడంతో పాటు అందులో ఉన్న ఆహార పదార్థాలను తినాలని ప్రయత్నం చేశాయి. ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఐఆర్‌సీటీసీ స్పందించింది. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని.. కిచెన్‌ను పరిశుభ్రంగా ఉంచేలా సిబ్బందికి అవగాహన కల్పించామని పేర్కొంది. By B Aravind 19 Oct 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి రైళ్లలో పంపిణీ చేసే ఆహార పదార్థాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటి నాణ్యతపై తరచుగా ఫిర్యాదులు వస్తుంటాయి. అయితే ఇటీవల ఓ రైలులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ రైలు వంటగదిలోని ఎలుకలు స్వైర విహారం చేశాయి. అయితే ఇందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ రైలు కిచెన్‌లోకి ఎలుకలు రావడం ఏంటని అనేగా మీ సందేహం. అక వివరాల్లోకి వెళ్తే.. టెండుల్కర్ అనే వ్యక్తి ఇటీవలె తన కుటుంబంతో కలిసి మడగావ్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణం చేశాడు. అయితే వంటగది వైపుగా కొన్ని ఎలుకలు వెళ్లడాన్ని అతడు గమనించాడు. అక్కడున్నటువంటి ఆహార పాత్రలపై రెండు ఎలుకలు తిరగడంతో పాటు అందులో ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీనాలని ప్రయత్నం చేశాయి. అయితే ఈ దృశ్యాలను అతను తన ఫోన్‌లో రికార్డు చేశాడు. అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. రైలు పాంట్రీలో దాదాపు ఏడు ఎలుకలు ఆహార పాత్రలపై తిరుగుతూ కనిపించాయని ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఐఆర్‌సీటీసీ దృష్టికి వెళ్లడంతో దీనిపై ఆ సంస్థ స్పందించింది. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపింది. కిచెన్‌ను పరిశుభ్రంగా ఉంచేలా చేయాలని సిబ్బందికి అవగాహన కల్పించామని పేర్కొంది. అయితే మళ్లీ ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా సరైన చర్యలు తీసుకుంటామని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియో చూసేయ్యండి. View this post on Instagram A post shared by RF Drx. Mangirish Tendulkar (@mangirish_tendulkar) #national-news #viral-news #train #rats మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి