Meta: ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వెరిఫైడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్

ఇండియాలో ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్‌లల వెరిఫైడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది మెటా. బిజినెస్‌ కోసం దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు మెటా తెలిపింది. దీంతో వినియోగదారులకు మరిన్ని ఫీచర్లు, ఆఫర్లను అందించనుంది.

New Update
Meta: ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వెరిఫైడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్

Verified Subscription: బిజినెస్‌ను పెంపొందించుకోవడానికి మెటా కొత్త ప్లన్‌ను తీసుకువచ్చింది. ఇప్పటికే ఇది మిగతా దేశాల్లో ఉది. ఇప్పుడు భారతదేశంలో కూడా దీన్ని తీసుకువచ్చింది. అదే ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్‌లలో వెరిఫైడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్. దీని ద్వారా మరిన్ని ఫీచర్లను అందించనుంది మెటా. వ్యాపారాల కోసం వెరిఫై చేయబడిన అకౌంట్లకు మెటా వెరిఫై బ్యాడ్జ్, మెరుగైన అకౌంట్ సపోర్ట్ అందిస్తుంది. మెరుగైన రక్షణతో పాటు అదనపు ఫీచర్లను అందించనుంది. ఈ ప్లాన్ నెలకు ఒక యాప్‌కి రూ. 639 నుంచి ప్రారంభమవుతుంది. ఇది రూ. 21,000 వరకు ఉంటుంది. ఇది రెండు యాప్‌లకు సంబంధించి ఒక నెలకు ప్రారంభ డిస్కౌంట్ రేట్ అని మెటా చెప్పింది.

ఈ వెరిఫైడ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారు ప్రత్యే బ్యాడ్జ్‌ను పొందుతారు. ఇది కస్టమర్లను అట్రాక్ట్ చేయడమే కాకుండా..వారితో ఇంటరాక్షన్‌ను మెరుగుపర్చడానికి సహాయపడుతుందని మెటా తెలిపింది. ఇదే కాకుండా వెరిఫై చేయబడిన బిజినెస్ సబ్‌స్క్రైబర్లు ప్లాన్లను పెంచుకున్నప్పుడు వారి రీల్స్‌లో మరిన్ని లింకులను యాడ్ చేసుకోవచ్చు. వివిధ మెటా ప్లాట్‌ఫారమ్‌లలో వారి ప్రొఫైల్‌ను మెరుగుపరచడానికి మరిన్ని ఫీచర్‌లకు యాక్సెస్ పొందవచ్చు.

Also Read:Maharashtra: డిగ్రీ పూర్తయితే నెలకు పదివేలు..మహారాష్ట్రలో కొత్త స్కీమ్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Gold Prices Today: భారీగా తగ్గిన బంగారం.. గ్రాము ఎంత ఉందంటే?

నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,340గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,140గా ఉంది. ఇక గ్రాము రేటు చూసుకుంటే.. రూ.9,834 గా మార్కెట్‌లో ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

New Update
Gold rate

Gold rate

గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు పైనే దాటింది. లక్ష లేనిదే బంగారం కొనలేరు. అందులోనూ తులం బంగారం అంటే చేతిలో లక్ష కంటే ఎక్కువగానే డబ్బులు పెట్టుకోవాలి. నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,340గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,140గా ఉంది. ఇక గ్రాము రేటు చూసుకుంటే.. రూ.9,834 గా మార్కెట్‌లో ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

Advertisment
Advertisment
Advertisment