Israel-Hamas: ఇజ్రాయెల్ , హమాస్ మధ్య చర్చలు.. ఎప్పుడంటే

కాల్పుల విరమణపై హమాస్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధమేనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ తెలిపారు. ఆయన ప్రకటనపై ఇంకా హమాస్ స్పందించలేదు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఆగస్టు 15న దోహా లేదా కైరోలో చర్చలు జరిగే అవకాశముందని తెలుస్తోంది.

New Update
GAZA: ఇజ్రాయెల్ మీద హమాస్ ఎదురుదాడి..8 మంది సైనికులు మృతి

Israel-Hamas News: ప్రస్తుతం గాజాలో ఇజ్రాయెల్ ఇంకా దాడులు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ కాల్పుల విరమణపై హమాస్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధమేనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ (Benjamin Netanyahu) తెలిపారు. ఆయన ప్రకటనపై ఇంకా హమాస్ స్పందించలేదు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఆగస్టు 15న ఖతర్ రాజధాని దోహా లేదా ఈజిప్టు రాజధాని కైరోలో (Cairo) చర్చలు జరిగే అవకాశముందని మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాలైన అమెరాక, ఈజిప్టు, ఖతార్‌ తెలిపాయి. అయితే హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థే కారణమే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌తో చర్చలు జరిపేందుకు హమాస్‌ ముందుకు వస్తుందా రాదా అనే దానిపై స్పష్టత లేదు.

Also Read: చెస్ ఛాంపియన్ షిప్ లో గెలిచేందుకు విషప్రయోగం చేసిన క్రీడాకారిణి..రికార్డయిన సీసీటీవి దృశ్యాలు!

ఇదిలాఉండగా.. 2023 అక్టోబర్ 7న గాజాలో ఉండే తీవ్రవాద సంస్థ హమాస్‌.. ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో వందలాది మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. ఈ ఘటన జరిగిన తర్వాత హమాస్ తీవ్రవాదులను అంతచేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ గాజాపై దాడులు చేయడం మొదలుపెట్టింది. ఇప్పటికీ అక్కడ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ పాటించేందుకు తమ దేశం నుంచి బంధీలుగా తీసుకెళ్లినవారిని హమాస్ విడిపించాలంటూ ఇజ్రాయెల్‌ కండిషన్ పెట్డింది.

Also Read: పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ కచేరీలలో బాంబు దాడులు ప్లాన్ చేసిన ISIS ఉగ్రవాదులు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లను మినహాయించారు.  దీనికి సంబంధించి అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.

New Update
iPHONE 16 Trump Tariffs

iPHONE 16 Trump Tariffs Photograph: (iPHONE 16 Trump Tariffs)

గత పది రోజులుగా ప్రపంచం మొత్తం టారీఫ్ ల వార్ తో దడదడలాడిపోతోంది. టారీఫ్ లతో దాదాపు అన్ని దేశాలనూ బెంబేలెత్తించారు. అయితే రెండు రోజు క్రితం ఈ సుంకాలకు 90 రోజుల బ్రేక్ ను కల్పిస్తూ అనౌన్స్ చేశారు. మళ్ళీ ఇందులో చైనాను మాత్రం కలపలేదు. దీంతో మిగతా దేశాలన్నీ కాస్త ఊపిరి పీల్చుకున్నా చైనాతో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా సుంకాల విషయంలో మరో కీలక నిర్ణయం ప్రకటించింది అమెరికా. 

ఫోన్లు, కంప్యూటర్ల మీద..

అమెరికా మీద చైనా 125 శాతం, అమెరికా 145 శాతం సుంకాలను విధించుకుంటున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తుల మీద 145 ఉంటాయి కానీ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల మీద కాదంటూ ఒక కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, హార్డ్‌ డ్రైవ్‌లు, కంప్యూటర్‌ ప్రాసెసర్లు, మెమొరీ చిప్‌లు, సెమీ కండక్టర్లు, సోలార్‌ సెల్స్‌, ఫ్లాట్‌ టీవీ డిస్‌ప్లేలు వంటి వాటిని ఈ ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందుతాయి. అమెరికాకు చెందిన యాపిల్ సంస్థకు సంబంధించి ప్రోడక్ట్స్ ఎక్కువ శాతం చైనా నుంచే వస్తాయి. 

యాపిల్ కంపెనీకి ఊరట..

సుంకాల పెంచడంతో స్మార్ట్ ఫోన్లు, యాపిల్ ఫోన్లు ధరలు పెరుగుతాయని వినియోగదారుల్లో ఆందోళన పెరిగింది. దీంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం అమెరికా వాసులు స్టోర్లకు కూడా పరుగెత్తారు. కానీ ఇప్పుడు అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. నిజానికి ప్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ఉత్పత్తుల మీద ప్రతీకార సుంకాలను పెంచాలంటే అవన్నీ అమెరికాలోనే తయారు చేయాలి. కానీ అక్కడ ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నట్టుండి తయారీ కంపెనీలను పెట్టడం కూడా  కుదరదు.  దీనికి కొన్నేళ్ళు సమయం పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అమెరికా సుంకాల నిర్ణయంతో అత్యధికంగా నష్టపోయిన యాపిల్ కంపెనీ...ఇప్పుడు తాజా నిర్ణయంతో హమ్మయ్య అనుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 today-latest-news-in-telugu | usa | china | trump tariffs | apple | i-phone

Also Read: SRH VS PBKS: ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడింది భయ్యా.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్

 

Advertisment
Advertisment
Advertisment