IPL-2024: ఉప్పల్ దంగల్...టికెట్ల లొల్లి

ఐపీఎల్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక మ్యాచ్ ఆడబోతోంది. మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతోంది. ఉప్పల్ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. అయితే ఈ మ్యాచ్‌ టికెట్ల మీద ఇప్పుడు పెద్ద రగడ అవుతోంది.

New Update
IPL-2024: ఉప్పల్ దంగల్...టికెట్ల లొల్లి

Hyderabad Vs Chennai: ఈరోజు ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ vs చెన్నై(Hyderabad vs Chennai) మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్‌రైజర్స్‌ బ్యాటర్ల విధ్వంసం చూసేందుకు అభిమానులు ఆరాటపడిపోతున్నారు. దాంతో పాటూ ధోనీ(Dhoni) బ్యాటింగ్ విన్యాసాలు చూసేందుకు కూడా అభిమానులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈసీజన్‌లో హైదరాబాద్ జట్టు సన్‌రైజర్స్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడి ఒకదానిలో మాత్రమే గెలిచింది. అయితే అందులో తన బ్యాటింగ్ విన్యాసాలతో మాత్రం తెగ ఆకట్టుకుంది. అది కూడా హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లోనే. ఆమ్యాచ్‌లో ట్రవిస్‌ హెడ్‌, అబిషేక్‌ శర్మ, క్లాసెన్‌ ఊచకోత కోశారు. ఇప్పుడు మరో సారి అలాంటి విన్యాసాలు చూసేందుకు హైదరాబాద్‌ అభిమానులు ఉవ్విళ్ళూరుతున్నారు. దాంతో పాటూ ధోనీ కోసం కూడా అభిమానుల తెగ ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఉప్పల్ స్టేడియానికి ఉన్న కరెంట్ కష్టాలు తొలిగిపోయాయి. బిల్లులు కట్టలేదని అధికారులు తొలగించిన కరెంట్‌ను తిరిగి పునరుద్ధరించారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు విద్యుత్ అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత విద్యుత్‌ను పునరుద్ధరించారు.

టికెట్ల లొల్లి...

అయితే ఇప్పుడు హైదరాబాద్ మ్యాచ్‌ కు అమ్మిన టికెట్ల మీద లొల్లి జరుగుతోంది. మొత్తం టికెట్లు అన్నింటినీ బ్లాక్‌లో అమ్మేవారని అంటున్నారు. టికెట్లు ఓపెనింగ్ చేసిన పదినిమిషాల్లో అయిపోవడంతో ఈ ఆరోపణలు వెల్లువెత్తాయి. టికెట్ల విషయంలో హెచ్‎సీఏ తీరుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు బ్లాక్ టికెట్ల ముఠాలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బ్లాక్ టిక్టలు అమ్ముతున్న వారు ఒక్కో టికెట్ ధర పది రెట్లు ఎక్కువగా అమ్ముతున్నారు. వెయ్యి రూపాయల టికెట్ ధర కాగా 6 వేలకు పైగా పలుకుతోంది.

దానం నాగేందర్ గొడవ..

దీని మీద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఫైర్ అవుతున్నారు. హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌కు టికెట్లు దొరకకపోవడం దారుణమని అన్నారు. జూబ్లీహిల్స్, చెక్‌సోస్ట్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, ఉప్పల్ స్టేడియంలో బ్లాక్ మార్కెట్ విక్రయాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. దీనంతటికీ కారణం హెచ్‌సీఏనే అంటున్నారు దానం. కాంప్లమెంటరీ పాస్‌లను కూడా బ్లాక్‌లో అమ్ముతోందని అంటున్నారు. హెచ్‌సీఏ తీరు మీద ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మరోవైపు హైదరాబాద్ టీమ్‌లో తెలుగు ప్లేయర్లస్ లేకపోవడం దారుణమని అంటున్నారు దానం నాగేందర్. డేవిడ్ వార్నర్‌ ఫిక్సింగ్ చేస్తున్నాడు అని నేను చెప్పినందుకే సన్ రైజర్స్ టీంలో నుండి తీసేసారు.
సన్ రైజర్స్ టీంలో ఒక్క తెలుగు ప్లేయర్ లేడు.. సన్ రైజర్స్ టీంలో తెలుగు ప్లేయర్ లేకుంటే ఉప్పల్‌లో మ్యాచ్ ఆడనివ్వను అని అంటున్నారు. జెమినీ కిరణ్, సన్‌ రైజర్స్ ఫ్రాంఛైజీ మొత్తం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాను డీఎన్‌ఆర్ అకాడయీని నడుపుతున్నానని...బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పని చేశానని చెప్పారు.

సైబర్ నేరాలు...

హైదరాబాద్ మ్యాచ్ టికెట్లు కొనాలునుకునేవారు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు, సైబర్ విభాగం సిబ్బంది అభిమానులను అప్రమత్తం చేసింది. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ టికెట్లు కొన్ని రోజుల కిందటే అన్నీ సోల్డ్ అవుట్ అయినా, టికెట్ల కోసం త్వరపడండి అంటూ సైబర్ నేరగాళ్లు ఐపీఎల్ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. మ్యాచ్ కు మీకు టికెట్లు ఇప్పిస్తామని కొందరు ఫేక్ లింకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపులతో పాటు ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా టికెట్లు కావాలంటే లింక్ క్లిక్ చేసి బుకింగ్ చేసుకోవాలని ఆన్ లైన్ లింక్స్ పోస్ట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఐపీఎల్ మ్యాచ్ చూసే ఛాన్స్ ఇంకా ఉందంటూ.. కొందరైతే క్యూఆర్ కోడ్స్ పంపించి డబ్బులు గుంజుతున్నారని చెప్పారు. అయితే ఆ లింకులు ఓపెన్ చేస్తే చాలు డబ్బులు పోతున్నాయి. బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయి.

Also Read:USA Tourist Visa:యూఎస్ పర్యాటక వీసాదారులకు గుడ్‌న్యూస్..డ్రాప్ బాక్స్ సదుపాయం

Advertisment
Advertisment
తాజా కథనాలు