Mallikarjun Kharge : మేము అధికారంలోకి వస్తే ఒక్కరే ప్రధాని.. మోదీ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. ఐదుగురు ప్రధానులు మారుతారని ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కౌంటర్ ఇచ్చారు. యూపీఏ పాలనలో పదేళ్ల పాటు మన్మోహన్ సింగ్ ఒక్కరే ప్రధానిగా ఉన్నారని గుర్తుచేశారు. ఈసారి కూడా ఒక్కరే ప్రధాని ఉంటారని స్పష్టం చేశారు

New Update
Mallikarjun Kharge : మేము అధికారంలోకి వస్తే ఒక్కరే ప్రధాని.. మోదీ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్

Manmohan Singh : లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ.. అధికార, విపక్ష పార్టీల నేతలు ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు. ఇటీవల ప్రధాని మోదీ (PM Modi).. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. ఐదేళ్లలో ఐదుగురు ప్రధానమంత్రులు ఉంటారని విమర్శలు గుప్పించారు. అయితే మోదీ వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) గట్టి కౌంటర్ ఇచ్చారు. 2004కు ముందు కూడా బీజేపీ నేతలు ఇలానే మాట్లాడారని అన్నారు. పదేళ్లపాటు సాగిన యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ ఒక్కరే ప్రధానిగా ఉన్నారంటూ గుర్తుచేశారు. హర్యానాలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read: వాహనాదారులకు అలెర్ట్.. పెరగనున్న టోల్‌ప్లాజా ఛార్జీలు

యూపీఏ 1,2 పాలనలో ఇతర పార్టీలన్నీ కూడా కాంగ్రెస్‌ (Congress) కు మద్దతిచ్చాయని తెలిపారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన సామర్థ్యంతో దేశ ఆర్థిక స్థితిని మార్చివేశారని అన్నారు. గత పదేళ్ల పాలనలో బీజేపీ ఏమి చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముగిసిన తర్వాత కూటమి నేతలంతా కలిసి ప్రధానమంత్రి ఎవరనేదానిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. 2004లో బీజేపీ ఇలా ప్రధానులు మారుతారంటూ కాంగ్రెస్‌పై విమర్శలు చేసిందని.. అప్పుడు యూపీఏ ప్రభుత్వాన్ని ఎలా నడిపించామో ఈసారి కూడా అదే కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Also Read: మనీష్ సిసోడియాకు హైకోర్టు షాక్

Advertisment
Advertisment
తాజా కథనాలు