India-Myanmar : భారత్-మయన్మార్‌ల మధ్య స్వేచ్ఛాయుత రాకపోకలుండవ్ : అమిత్ షా

భారత్-మయన్మార్‌ల మధ్య స్వేచ్ఛాయుత రాకపోకల విధానాన్ని (FMR) రద్దు చేయాలని కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి అమిత్ షా 'ఎక్స్‌'లో వెల్లడించారు. దేశ భద్రత, ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా సమతుల్యత తదితర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

New Update
India-Myanmar : భారత్-మయన్మార్‌ల మధ్య స్వేచ్ఛాయుత రాకపోకలుండవ్ : అమిత్ షా

Amit Shah : మయన్మార్, భారత్‌(India-Myanmar) ల మధ్య యథేచ్చగా జరుగుతున్న రాకపోకలను నిలిపివేయాలని భారత్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్స్‌(X) (ట్విట్టర్‌) లో కీలక ప్రకటన చేశారు. దేశ భద్రత, ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా సమతుల్యత తదితర కారణాల వల్ల భారత్- మయన్మార్.. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛాయుత రాకపోకల విధానాన్ని(FMR) రద్దు చేయాలని కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుందని తెలిపారు. తక్షిణమే ఈ స్వేచ్ఛాయుత రాకపోకల విధానాన్ని నిలిపివేయాలని హోంశాఖ సిఫార్సు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Also Read : బీజేపీ గెలవొద్దని కుట్రలు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఇప్పటికే పలు ఈశాన్య రాష్ట్రాలైన మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరాంలు మయన్మార్‌ దేశంతో సరిహద్దును పంచుకుంటున్నాయి. అయితే ఇప్పటివరకు కూడా సరిహద్దు దాటి ఇరు దేశాల వైపు 16 కిలోమీటర్ల వరకు ఎలాంటి వీసా లేకుండానే ప్రజలు స్వేచ్ఛగా తిరిగే వెసులుబాటు ఉండేది. అయితే ఈ మధ్య మయన్మార్‌ నుంచి భారత్‌లోకి అక్రమంగా వచ్చేవారి సంఖ్య పెరిగిపోయింది. వీటిని అరికట్టేందుకే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇందుకోసమే సరిహద్దులో 1,643 కిలోమీటర్ల పొడవునా కంచెను నిర్మించనున్నట్లు అమిత్‌ షా(Amit Shah) ఇటీవలే స్పష్టం చేశారు. ఇప్పుడు తాజాగా ఎఫ్‌ఎంఆర్‌ను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

Also Read: టిష్యూ పేపర్‌ పై రైల్వే మంత్రికి ఐడియా.. అంతే 6 నిమిషాల్లో మంత్రి నుంచి కాల్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు