Under-19 : ఇంకొక్క అడుగే.. ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌

అండర్-19 టీమ్‌ఇండియా జట్టు వరల్డ్ కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికాను భారత్‌ 2 వికెట్ల తేడాతో ఓడించి తుదిపోరుకు సిద్ధమైంది. అండర్‌-19 ప్రపంచకప్‌లో ఫైనల్‌ చేరడం భారత్‌కు ఇది వరుసగా అయిదోసారి కావడం విశేషం.

New Update
Under-19 : ఇంకొక్క అడుగే.. ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌

Under-19 World Cup : భారత కుర్రాళ్లు మరోసారి అదరగొట్టారు. అండర్-19 టీమ్‌ఇండియా(Under-19 Team India) జట్టు వరల్డ్ కప్ ఫైనల్‌(World Cup Final) కు దూసుకెళ్లింది. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా(South Africa) ను భారత్‌ 2 వికెట్ల తేడాతో ఓడించి తుదిపోరుకు సిద్ధమైంది. అండర్‌-19 ప్రపంచకప్‌లో ఫైనల్‌ చేరడం భారత్‌కు ఇది వరుసగా అయిదోసారి కావడం విశేషం.

View this post on Instagram

A post shared by ICC (@icc)

దక్షిణాఫ్రికా దూకుడు..
ఇక మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 7 వికేట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. లువాన్‌ ప్రిటోరియస్‌ (76), రిచర్డ్‌ సెలెట్స్‌వాన్‌ (64) ఇద్దరూ భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ గౌరవ ప్రదమైన స్కోర్ అందించారు. అయితే లక్ష్య సాధనలో భారత్‌ అనూహ్యంగా తడబడింది. దక్షిణాఫ్రికా పేసర్ల ధాటికి 32కే 4 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. దక్షిణాఫ్రికా పేసర్లు మఫాకా, ట్రిస్టాన్‌ భారత బ్యాటర్లను కుదురుకునే అవకాశమే ఇవ్వలేదు. భారత్‌కు ఓటమి తప్పదనుకున్నారు. కానీ గత మ్యాచ్‌ సెంచరీ హీరోలు సచిన్‌ దాస్‌, ఉదయ్‌ సహరన్‌ మలుపు తిప్పేశారు.

తడబడ్డ భారత్..
ఈ టోర్నీలో నిలకడగా రాణించిన ముషీర్‌ఖాన్‌ (4), అర్షిన్‌ కులకర్ణి (12) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. అయితే దక్షిణాఫ్రికా పేసర్లను జాగ్రత్తగా ఎదుర్కొన్న ఈ జంట.. స్పిన్నర్లు వచ్చాక జోరు పెంచింది. చెత్త షాట్లకు వెళ్లకుండా బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించిన ఈ జోడీ.. అయిదో వికెట్‌కు 171 పరుగులు జత చేసి భారత్‌ను పోటీలోకి తెచ్చింది. ఈ దశలోనే సచిన్‌ దాస్‌ (96; 95 బంతుల్లో 11×4, 1×6), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఉదయ్‌ సహరన్‌ (81; 124 బంతుల్లో 6×4) సత్తా చాటడంతో భారత్‌ 48.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సచిన్ వరుసగా రెండో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

ఇది కూడా చదవండి : తులసి మొక్కను పవిత్రమైనదిగా ఎందుకు భావిస్తారు? శాస్త్రం చెబుతుంది నిజమేనా?

సచిన్, సహరన్..
అండర్‌-19 ప్రపంచకప్‌లో టోర్నీ మొత్తం కెప్టెన్‌ ఉదయ్‌ సహరన్‌(Captain Uday Saharan), సచిన్‌ దాస్‌(Sachin Das) ఆట అద్భుతం. కీలక సమయంలో వీళ్ల విలువైన ఇన్నింగ్స్‌లే భారత్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లాయి. సూపర్‌ సిక్స్‌ రెండో మ్యాచ్‌లో నేపాల్‌పై టాప్‌ఆర్డర్‌ విఫలమైన పరిస్థితుల్లో సెంచరీలతో జట్టును ఆదుకుని విజయంలో కీలకపాత్ర పోషించిన ఉదయ్‌, సచిన్‌.. సెమీస్‌లో కఠిన పరిస్థితుల్లో ఎంతో పరిణతితో ఆడి జట్టును విజయతీరాలకు చేర్చడంతో కీలక పాత్ర పోషించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు