/rtv/media/media_files/2025/03/25/lvLO98NA4KbfJszCWylN.jpg)
UttarPradesh Wife kills husband
Wife killed husband: యూపీలో భర్తల గుండెపగిలే సంఘటన జరిగింది. దాంపత్య జీవితంపై ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న యువకుడిని పారాణి ఆరకముందే నవ వధువు లేపేసింది. ఒకరిని ప్రేమించి పేరెంట్స్ బలవంతానికి మరొకరిని ఇష్టం లేని పెళ్లి చేసుకున్న యువతి అతనితో సంసారం చేయలేక రెండు వారాల్లోనే ప్రియుడితో కలిసి కడతేర్చింది. పెళ్లి బహుమతిగా వచ్చిన డబ్బులను సుపారిగా ఇచ్చి అత్యంత దారుణంగా వ్యాపారి అయిన వరుడిని చంపించింది.
నాలుగు సంవత్సరాలుగా ప్రేమ..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్య నివాసి అయిన ప్రగతి (22).. మెయిన్‌పురికి చెందిన వ్యాపారవేత్త (24) దిలీప్‌కు 2025 మార్చి 5 వివాహం జరిగింది. అయితే ప్రగతి అప్పటికే అనురాగ్ అనే యువకుడితో గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమలో ఉంది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ పేరెంట్స్ ప్రగతికి బలవంతంగా పెళ్లి చేశారు. దీంతో ఎలాగైనా దిలీప్ ను చంపి అనురాగ్ ను మళ్లీ పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేసిన ప్రగతి.. ప్రియుడితో కలిసి మర్డర్ స్కెచ్ వేసింది.
Also Read: Pawan Kalyan: ఇకపై సినిమాలు చేయరా? పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఈ క్రమంలోనే పెళ్లితో బహుమతిగా వచ్చిన రూ. 2 లక్షలను సుపారి గ్యాంగ్ కు ఇచ్చారు. వివాహం జరిగిన 15 రోజులకు మార్చి 19న దిలీప్ పై దుండగులు కాల్పులు జరిపారు. అనురాగ్ బయటకెళ్దామని చెప్పి దిలీప్ ను తీసుకెళ్లగా.. నమ్మించి ఔరయ్యలోని సహార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పాలియా గ్రామం సమీపంలోని గోధుమ పొలంలో కాల్చేపడేశారు. స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ దిలీప్ మార్చి 21 మరణించారు. స్థానికులు, బంధువుల సమాచారం ప్రకారం సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి.. ప్రగతి, ఆమె ప్రేమికుడు అనురాగ్, ఒక షూటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 315 బోర్ పిస్టల్స్, లైవ్ కార్ట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ (ఔరయ్య) అభిజీత్ ఆర్ శంకర్ తెలిపారు.
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
murder | today telugu news